సామాజిక న్యాయానికి పాతరవేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

బడ్జెట్‌లలో దళిత, గిరిజనులకు అన్యాయం

కాంగ్రె,స్‌ బిజెపిల భావజాలం వేరైనప్పటికి,సామాజిక న్యాయాన్ని పాతర వేయడంలో ఒక్కటిగానే వున్నాయి. కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌ లలో దళిత,గిరిజనులకు కేటాయించిన నిధులే నిదర్శనం.  దేశంలో 20 శాతం వున్న దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించలేదు. కోతల నిధులతో సంపూర్ణ సామాజిక న్యాయం సాధిస్తామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో సెలవిచ్చారు. రాష్ట్రంలో సైతం 18 శాతం జనాభా వుందని ఎన్నికల మ్యానిపెస్టో లో పొందుపరిచి బడ్జెట్‌ కెటాయింపులు మాత్రం 15 శాతం జనాభా ప్రతిపాదికనే కెటాయించి బిజిపి కేంద్ర ప్రభుత్వం బాటలో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం నడిచింది. కేంద్ర బడ్జెట్‌ లో గిరిజనుల బడ్జెట్‌ అంకెల గారడిగి మారింది.గత సంవత్సరం సవరించిన బడ్జెట్‌లో 12461 కోట్లు కేటాయించి ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 539 కోట్లు స్వల్పంగా పెంచి 13000 కోట్లు కేటాయించారు. కేంద్రం లోమొత్తం బడ్జెట్‌ 48.20లక్షల బడ్జెట్‌ లో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కు ఎస్సీల జనాభా 20 శాతం దామాషా ప్రకారం కేటాయించకుండా కేవలం 16శాతం ప165492.72 లక్షల కోట్లు కేటాయించి కేంద్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చెసింది.

ఇక రాష్ట్రంలో….ఇక రాష్ట్ర బడ్జెట్‌ ను పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 1803 కోట్ల నిధులకు కోత కొసి కేవలం 50,180,13 కోట్లు కేటాయించింది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి కి గత ప్రభుత్వం 36750 కోట్లు కేటాయించి కేవలం 14649 కోట్ల నిధులను మాత్రమే ఖర్చు చెసింది.2024-25 బడ్జెట్‌ లో ఎస్సీ అభివృద్ధి నిధి కి 33,124.04 కోట్లు మాత్రమే కేటాయించింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ 2,91,159 కోట్లు కాగా పెరిగిన దళితుల జనాభా 18 శాతం దామాషా ప్రకారం 52,409కోట్లను కేటాయించకుండా కేవలం33,124 కోట్లు మాత్రమే కేటాయించింది.జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకుండా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని ఉల్లంఘించింది. గత ప్రభుత్వం అమలు చెసిన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పధకం స్ధానం లో 12 లక్లకు పెంచి  అంబేడ్కర్‌  ఆభయ హస్తం పధకం అమలు చేస్తామని చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌ లో ప్రకటించింది. కాని బడ్జెట్‌ పత్రం లో మాత్రం తెలంగాణ దళిత బంధు పధకానికి రేండు వేల కోట్లు కేటాయించడం చూస్తే గత బడ్జెట్‌ ను కాపి పెస్ట్‌ చెసిందనడానకి నిదర్శనం. రాష్ట్రంలో 18 లక్షల కుటుంబాలకు కేవలం రెండు వేల కోట్లు కేటాయించినది అంటే ఈ ఆర్ధిక సంవత్సరంలో కేవలం 1666 కుటుంబాలకు మాత్రమే దళిత బధు కాదు కాదు అంబేడ్కర్‌ అభయ హస్తం పధకం అందనుంది.కాని ఇప్పటి వరకు పధకం అమలుకు మార్గదర్శకాలు విడుదలలో నిర్లక్ష్యం వహిస్తుంది.

 

ఇక పధకం అమలు ప్రారంభానికి ఇక ఎన్ని నెలలు ఎదురు చాడాలనొ… అంబేడ్కర్‌ ద్రవ్య నిధి కి 38 కోట్లు పాత విద్యార్థులకే సరిపొవు. విద్యకు 15 శాతం నిధులు పెంచుతామని ఎన్నికల హమిలో హమి ని తుంగలో తోక్కి కేవలం 7.3 శాతమే నిధులను మాత్రమే కేటాయించింది. మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూళ్ళ ఏర్పాటు చెస్తామనె హమిని పక్కన పెట్టి సంక్షేమ హాస్టళ్ళ సమీకృత హస్టల్‌ గా మారస్తామని రెండువేల కొట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్రంలో దళితుల పై పెరుగుతున్న దాడుల నివారణకు ఎలాంటి చర్యలకు హమి ఇవ్వలేదు. ప్రస్తుత బడ్జెట్‌ లో కేటాయించిన 244 కోట్లు బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పాత బకాయిలకె సరిపొవు. కౌలు రైతులకు రైతు భరోసా పధకాన్ని అమలు చెస్తామని ఎన్నికలలో చెప్పి బడ్జెట్‌ లో కౌలు రైతు అనే మాట ను నిషేధించి బాటలో నడిచి 22 లక్షల కౌలు రైతులను దగా చెసింది. గుడ్డిలో మెల్ల అన్న చందంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేల ఆర్ధిక సహయం పధకానికి సైతం కేవలం 1200 కోట్ల ను మాత్రమే కేటాయించినది.రాష్ట్రంలో ఉపాధి హమి పధకం కింద 55 లక్షల కూలీ కుటుంబాలు వుండగా కేవలం పది లక్షల కుటుంబాలకె ఈ పధకం కింద సహయం అందనుంది.

 

ఇక ఇందిరమ్మ ఇండ్ల పధకానికి 7,740 కోట్లు మాత్రమే కేటాయించింది. నియోజకవర్గానికి 3500,రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్లను నిర్మించనున్నది.పేదల ఇంటికి 5 లక్షలు,ఎస్సీ, ఎస్టీ లకు ఆరు లక్షల సహయం ప్రకటించింది. కాని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి పది లక్షలు చెల్లిస్తెనే పేదల స్వంత ఇంటి కళ నేరవెరనున్నది. ఆరోగ్య శ్రీ పధకాన్ని 5 లక్షల నుండి పది లక్షలకు పెంచిన ప్రభుత్వం బడ్జెట్‌ లో మాత్రం అరకొర నిధులనే కేటాయించింది.గత సంవత్సరం 1,101కోట్లు కేటాయించి 850 కోట్లు ఖర్చయ్యాయి.ప్రస్తుత బడ్జెట్‌ లో 1,065 కోట్లు మాత్రమే ఆరోగ్య శ్రీ కి కేటాయించింది.

ఇక రాష్ట్రం లో వున్న గిరిజనుల జనాభా దామాషా ప్రకారం 22 వేల కోట్ల నిధులు కేటాయించకుండా కేవలం 17,056 కోట్ల ను ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించి చెతులు దులుపుకుంది. అంబేడ్కర్‌  ఆభయ హస్తం పధకాన్ని సైతం గిరిజనులకు అమలు చెస్తామని చెప్పి బడ్జెట్‌లో అ ఊసెలేదు. చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌ లో హమి ఇచ్చిన పధకాలకు సంపూర్ణ నిధులను కేటాయించకుండా తాను ఇచ్చిన హమిలను కాంగ్రెస్‌ విస్మరించిందని చెప్పక తప్పదు. బడ్జెట్‌ అంచనాలను సచరించి చేవెళ్ళ డిక్లరేషన్‌ లో హమి ఇచ్చిన పధకాలకు నిధులు కేటాయించి కాంగ్రెస్‌ తన మాట నిలుపు కొవాలి.

  -పి.శంకర్‌
జాతీయ కార్యదర్శి దళిత బహుజ ఫ్రంట్‌
సెల్‌:  9441131181    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page