సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా
ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం

కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ కేతనం ఎగురవేసింది. . సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్‌లు ఉండగా అందులో ఐదు ఏరియాలను ఎఐటియూసి గెలుపొందింది. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్‌ కేంద్రాలలో 37468 వోట్లు నమోదు కాగా అందులో అత్యధిక వోట్లు సాధించి కార్మిక గుర్తింపు సంఘం హోదాను దక్కించుకుంది. బెల్లంపల్లి 122, రామగుండం 1వ ఏరియాలో 417, రామగుండం2వ ఏరాయాలో 333, మందమర్రి 467, శ్రీరాంపూర్‌ ఏరాయాల్లో 2166, ఇలా మొత్తం 3465 వోట్ల మెజారిటీని ఎఐటియూసి సాధించింది. కార్పొరేట్‌లో 296, కొత్తగూడెం 233, మణుగూరు 2, ఇల్లందుaవ 46, భూపాలపల్లి 801, రామగుండం 3వ ఏరాయాలో 104 ప్రత్యర్థి ఎఐటియూసిపై అధికంగా వోట్లు పోల్‌ అయ్యాయి. ఈ ఆరు ఏరియాల్లో మొత్తం 1482 వోట్ల మెజారిటీ సాధించి ఎఐటియూసిపై పై చేయ్యి సాధించింది. ఐఎన్‌టియూసి.మిగిలిన ఆరు ఏరియాల్లో ఐన్‌టియూసి దక్కించుకుని రెండవ స్థానంలో నిలిచింది. అయితే ప్రధానమైన ఏరియాలను ఐఎన్‌టియూసి గెలుచుకుంది. అందులో కొత్తగూడెం కార్పోరేట్‌, కొత్తగూడెం ఏరియా, ఇల్లందు, మణుగూరు ఏరియాల్లో ఐఎన్‌టియూసి విజయబావుట ఎగురవేసింది. ఈ పోటీలో 13 గుర్పింపు కార్మిక సంఘాలు పోటీ పడ్డాయి. కానీ ప్రధాన కార్మిక సంఘాలై ఎఐటియూసి, ఐఎన్‌టియూసి, మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఆర్జీ 1లోని 1వఏరియాలో 2212, 2వ ఏరియాలో2852 , ఆర్జీ2లో 3369, ఆర్జీ3లో 3612, భూపాలపల్లి 5123, బెల్లంపల్లి 959, మండమర్రి 4515, శ్రీరామ్‌ పూర్‌లోని 1వ ఏరియాలో 4902, 2వ ఏరియాలో 3589 భద్రాద్రి జిల్లాలోని కార్పోరేట్‌ ఏరియా హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌ కలుపుకుని 1146, కొత్తగూడెం ఏరియాలొ 2207, ఇల్లందులో604, మణుగూరు ఏరియాలో 2378 మంది సింగరేణియుల వోట్లు పోల్‌ అయ్యాయి. జిల్లాలో మొత్తం 6581 మంది కార్మిక వోటర్లు ఉండగా అందులో 6335 వోట్లు నమోదు అయ్యాయి. ఈ 11 డివిజన్‌లలో అత్యధిక వోట్లు సాధించడంతో ఆసంఘాన్ని గుర్తింపు సంఘంగా అవతరించింది.దీనితో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం హోదాను నాలుగవ సారి దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page