రూ. 711 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్లు బోనస్ కింద విడుదల చేసింది. ఈ మొత్తం నుంచి ఒక్కో కార్మికుడికి రూ. లక్షా 53 వేల బోనస్ ఇవ్వనున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.
దీంతో సింగరేణిలో పనిచేస్తున్న 42 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. లక్షా 53 వేల చొప్పున బోనస్ లభించనుంది. అదే విధంగా ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్ కూడా చెల్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు.