ఐఎన్టీయూసీతోనే సంకేమం సాధ్యం
కార్మికులకు 250 గజాల ఇళ్ల స్థలము,
రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు
మంత్రి పొంగులేటి
కొత్తగూడెం : సింగరేణి సంస్థను ప్రైవేటీకరణకు చేపట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని, డిపెండెంట్ నియామకాలలో
దళారీ వ్యవస్థను అరికడతామని రెవెన్యూ శాఖా మండ్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత పాలకులు డిపెండెంట్ నియామకాల్లో దలారులకు కొమ్ము కాసిందని విమర్శించారు. దీనితో కార్మికులు నష్టపోయారని తెలిపారు. 2017లో సింగరేణి ఎన్నికలలో బిఆర్ఎస్ అనుబంధ సంస్థ కార్మిక సంఘం టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించుకున్నామాని గుర్తు చేశారు. బిఆరెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ నిరంకుశత్వంతో సమస్యలపై కార్మికుల పక్షాన ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి లేని దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని అన్నారు. నేడు ఆ పరిస్థితి లేదనని తానే ఆ బాధ్యతను తీసుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులు చూపించిన ఆధార అభిమానులతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో కార్మికుల జీవితాలు మరింత మెరుగు పడతాయని స్పష్టం చేశారు. అధికారంలో లేని పార్టీ మాయమాటలు చెప్పి కార్మికులను మోసగించే ప్రయత్నం చేస్తుందని కార్మికులు దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. టిబిజికెఎస్ వల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవ చేశారు. నేడు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీరు చూపిన ఆదరాభిమానాలే కారణం అన్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చారు. కార్మికులకు, కార్యకర్తలక కష్టసుఖాల్లో అండగా నిలుస్తాను అన్నారు. సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.సింగరేణిలో కార్మికుల పేరు మార్పిడిలో గత పాలకులు విఫలం చెందారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కచ్చితంగా సాధించుకుందామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలలో దళారులకు 4 లక్షల నుండి రూ 10 లక్షల వరకు వసూళ్ళ పాల్పడిన దౌర్భాగ్యం దుస్థితి నెలకొందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి ఒక్క రూపాయి చెల్లించవలసిన అవసరం లేదన్నారు. దలారి వ్యవస్థను అరికడతామన్నారు. విద్యా, వైద్యం కోసం సింగరేణి సంస్థతోపాటు ప్రభుత్వం అన్ని విధాలుగా కార్మికుల పక్షాన నిలుస్తుందన్నారు. ఇన్కమ్ టాక్స్, అలవెన్స్ వాటిపై విధించే వడ్డీలను యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టాలని కోరారు. కేంద్రంలో సింగరేణి సంస్థ పరిరక్షణకుఅవసరమైన విధి, విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తోంది అన్నారు. డిసెంబర్ 23న సింగరేణి దినోత్సవ సందర్భంగా సెలవును రోజుగా ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త భూగర్భ గానులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. విద్యావంతులైన కార్మికులకు తమకు అర్హత ఉన్న ఉద్యోగాలు, మహిళా కార్మికులకు అనువైన ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.సింగరేణి సంస్థలో 60 వేల కార్మికులు ఉండేవారని, బిఆర్ఎస్ పాలన వచ్చాక కారికుల సంఖ్యను కుదించిందని ఆరోపించారు. ఆ సంఖ్య నేడు 39,250 ఉద్యోగస్తులకు చేరిందన్నారు. సింగరేణి సంస్థలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని,ఉద్యోగులకు ఒకటో తేదీ నుంచి 5లోపు జీతాలు చెల్లిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు. వివిధ కార్మిక సంఘాల నుండి వచ్చిన కార్మికులకు ఐఎన్టీయూసీ సంఘం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.