సిఎం కేసీఆర్ ఫోటోలతో ఆర్టిస్టు  ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర..

*సిఎం కేసీఆర్ పట్ల అభిమానం చాటుకున్న ఆంధ్రా కు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి..
ఏడు రోజుల పాటు సాగిన సైకిల్  ప్రయాణం..
*శుక్రవారం ప్రగతి భవన్ కు వచ్చిన ఆర్టిస్టు బృందాన్ని సాదరంగా ఆహ్వానించి, అభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్..
దివ్యాంగుడుగా అనేక కష్టాలననుభవించి స్వయం కృషితో పెయింటింగ్ ఆర్టిస్ట్ గా ఎదిగిన తుపాకుల రామాంజనేయరెడ్డిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరు పట్టణం. పట్టువదలకుండా అనుకున్నది సాధిస్తూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వస్తున్న సిఎం కేసీఆర్ గారంటే ఎనలేని అభిమానమని  రామాంజనేయరెడ్డి తెలిపారు. తెలంగాణను సాధించడమే కాకుండా అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న సిఎం కేసీఆర్ ఆదర్శవంతమైన నేతగా పేర్కొన్నారు.
అదే అభిమానం తో ఇరువై రోజుల పాటు కష్టపడి కాన్వాస్ మీద ఆక్రిలిత్ తో పాటు గండికోట మట్టితో  మోనో కలర్ లో చిత్రించిన సిఎం కేసీఆర్ ప్రత్యేక పెయింటింగ్ ను తాను స్వయంగా గీసానని రామాంజనేయ రెడ్డి తెలిపారు.
 వాటిని ప్రత్యేకంగా ఫ్రేములు కట్టించుకోని ప్రొద్దుటూరు నుంచి సైకిల్ యాత్ర ద్వారా 7 రోజుల పాటు ప్రయాణం చేసి తన మిత్రులతో కలిసి హైద్రాబాద్ చేరుకున్నానని సంతోషంగా చెప్పారు రామాంజనేయరెడ్డి.
శుక్రవారం నాడు  తన బృందంతో కలిసి ప్రగతి భవన్ కు చేరుకున్న ఆర్టిస్టు బృందాన్ని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.తారక రామారావు సాదరంగా ఆహ్వానించారు.
సిఎం కేసీఆర్ పట్ల వారికున్న అభిమానాన్ని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్, వారు తెచ్చిన ఫోటోలను సిఎం కేసీఆర్  తరఫున స్వీకరించి వారి కృషిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page