– ఆరు దశాబ్దాల నేతన్నల కృషికి విశ్వఖ్యాతి..
గొల్ల భామ ప్రాచుర్యతను ప్రత్యేకతను ట్విట్టర్ వేదికగా వివరిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తూ నేతన్నల కు మంత్రి హరీష్ రావు.. అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు. తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్ ఘల్ లాడిస్తూ, మెండైన కొప్పులో తురిమిన పూలు అల్లల్లాడుతుండగా పల్లెపట్టుల్లో అలనాడు కలియదిరిగిన గొల్లభామల గురించి మనందరికీ తెలుసని గొల్లబామ ప్రత్యేకతను వివరించారు..
వనితల సింగారం దారాల్లో ఇమిడిపోతే… ఆ మహిళామణుల ముగ్ధత్వం చీరలో మెరిసిపోతే… అదే గొల్లభామ చీర. సిద్దిపేట నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ చీరల తయారీలో సిద్దిపేటకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉందని గొల్ల భామ ఎంతో ప్రాచుర్యత ఉందన్నారు.. గత 10ఏళ్ల క్రితం భౌగోళిక గుర్తింపు పొందిన సిద్దిపేట గొల్లబామ చీర …నేడు యునెస్కో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు..ఇప్పటికే గొల్లబామ చీరలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జౌళి శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ షోరోమ్ లలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసామని . సిద్దిపేట ప్రాంతం గొల్లబామ చీరకు చిరునామా గా , సిద్దిపేట కు ఏ అతిథి వచ్చిన గుర్తు గా ఇచ్చే గొల్ల భామ కు నేడు విశ్వ ఖ్యాతి రావడం నేతన్నల కృషి వారి పట్టుదలకు నిదర్శనమని వారి సేవలకు గుర్తింపన్నారు.. ఈ సందర్భంగా సిద్దిపేట నేతన్నలను అభినందిస్తున్న.. ఇంతటి ఖ్యాతి రావడం పట్ల కృషి చేసిన భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు.