సిద్దిపేట స్వచ్‌ ‌బడి @ బోర్డ్ ఎగ్జామ్‌..

  • ‌మంత్రి హరీష్‌ ‌రావు నియోజకవర్గానికి అరుదైన గౌరవం..
  • ఇంటర్‌ ‌బోర్డ్ ఎగ్జామ్‌లో కీలక ప్రశ్నగా ప్రస్తావన..
  • మంత్రి హరీష్‌ ‌రావు పేరు ప్రస్తావిస్తూ నాలుగు మార్కుల ప్రశ్నగా స్వచ్‌ ‌బడి వ్యాసం
  • లక్షలాది మంది విద్యార్థులకు చేరిన స్వచ్ఛ ప్రయోగశాల
  • పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవం..అభివృద్ధి సార్థకతకు నిదర్శనం
  • ప్రజల భాగస్వామ్యానికి  దక్కిన గౌరవం : మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు

సిద్ధిపేట, మే 9 (ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట నియోజకవర్గం అబివృద్ధికి ప్రయోగశాల..అధ్యయన కేంద్రం అని ఎన్నో మార్లు మంత్రి హరీష్‌ ‌రావు, అదే విధంగా సిద్దిపేట అభివృద్ధిని చూసేందుకు వొచ్చిన ప్రముఖుల మాటల్లో విన్నాం. మరోసారి ఆ మాటలు నిజం కావడానికి నిదర్శనంగా ఈ రోజు సిద్ధిపేట అభివృద్ధిలో భాగంగా దేశంలో రెండవ స్వచ్‌ ‌బడి సిద్దిపేటలో ఇటీవల మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించారు. ఈ స్వచ్‌ ‌బడిపై సోమవారం జరిగిన ఇంటర్‌ ‌ప్రథమ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్‌లో ఒక ప్రశ్నగా రావడం మంత్రి హరీష్‌ ‌రావు అభివృద్ధి దక్కిన అరుదైన గౌరవం. 4 మార్కులతో ఒక వ్యాస రూపంలో స్వచ్‌ ‌బడిపై ప్రశ్నగా ఇచ్చారు. మొదటిది బెంగుళూరు నగరంలో ఉండగా రెండవది సిద్దిపేటలో. ఈ ప్రశ్న రాష్ట్రంలోని లక్షలాది మంది ఇంటర్‌ ‌విద్యార్థులకు ఒక స్పూర్తిని ఇచ్చింది. సిద్ధిపేట ప్రజలకు అభివృద్ధి ఒక గొప్ప గౌరవంగా నిలిచింది.

ఇంకుడు గుంతలు పాఠ్యపుస్తకాల్లో.. స్వచ్‌ ‌బడి పరీక్షల్లో..
సిద్ధిపేట అవార్థుల్లో ఆదర్శం..దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అవార్డులు ప్రకటించారు అంటే సిద్దిపేట పేరు లేకుండా ఉండదు. దేశంలోనే ఇంకుడు గుంతలు నిర్మించి ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌ ‌గ్రామం..ఇంకుడు గుంతల నిర్మాణం ఒక ప్రయోగాత్మకం అంటూ పాఠ్యపుస్తకాల్లో పాఠంగా ప్రాచుర్యంలోకి వొచింది. అదే స్ఫూర్తితో మరో గౌరవం సిద్దిపేట స్వచ్‌ ‌బడి రూపంలో దక్కింది..నేడు ఇంటర్‌ ‌పరీక్షల్లో ప్రశ్నగా వొచ్చింది. నాడు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా..నేడు పరీక్షల్లో ప్రశ్నగా రావడంతో సిద్ధిపేట మరో ఘనత సాధించింది.

 

పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవం..అభివృద్ధి సార్థకతకు నిదర్శనం..ప్రజల భాగస్వామ్యానికి దక్కిన గౌరవం : మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు
అభివృద్ధి ప్రజల భాగస్వామ్యానికి దక్కిన గౌరవం అని సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేట అభివృద్ధి…ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనంలో భాగంగానే సిద్దిపేటలో స్వచ్‌ ‌బడిని ఏర్పాటు చేసామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. సిద్ధిపేట స్వచ్ఛతతో ఆదర్శంగా నిలవాలంటే స్వచ్‌ ‌బడి పాఠాలు ప్రతీ ఒక్కరికీ చేరడమే ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే వేలాది మంది ఈ స్వచ్చ్ ‌బడిని సందర్శించి చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు లక్షలాది మంది హాజరయ్యే ఇంటర్‌ ‌బోర్డు ఎగ్జామ్‌ ‌పరీక్ష పత్రంలో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ఈ విషయం మాకు, మా సిద్ధిపేట మున్సిపల్‌ ‌పాలకవర్గం, అధికారులు, సిబ్బంది ముఖ్యంగా మా ప్రజలకు గర్వకారణం. ఇదే స్ఫూర్తితో మరిన్ని వినూత్నమైన, ఆదర్శమైన కార్యక్రమాలను చేపడతాం. అంటూ ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page