సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని పటాన్ చెరు మండల పరిధిలో రుద్రారం గ్రామ పరిధిలోగల ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. గణనాథుని కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రష్వత్తంగా ప్రసిద్ధి చెందిన సిద్ది గణపతి దేవాలయాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అన్నదాన సత్రం, రాజగోపురాలు, దుకాణ సముదాయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఎంపీటీసీ రాజు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో మోహన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page