నాడు ప్రజలు ఆదరించారు…నేడు దూరం చేసారు
భద్రాచలం కమ్యూనిస్టుల కంచుకోట బద్ధలు
సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తూనే బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…!
నియోజకవర్గంలో పట్టుకోల్పోయిన సిపిఎం
భద్రాచలం, ప్రజాతంత్ర:ఒకప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉండేవారు. క్రమక్రమంగా నియోజకవర్గంలో సిపిఐ, సిపియం పార్టీల గ్రాఫ్ తగ్గుతూ వొచ్చింది. 2023 ఎన్నికలు వొచ్చేసరికి నియోజకవర్గంలో పూర్తిగా పట్టు కోల్పోయే పరిస్ధితి కనపడుతుంది. నాయకులు, కార్యకర్తలు వివిధ పార్టీలలో చేరారు. అంతేకాకుండా ప్రజలపక్షాన ఉండే కమ్యూనిస్టులు ప్రజలను విస్మరించారు. అందుకోసమే నియోజకవర్గంలో కమ్యూనిస్టులను ప్రజలు విస్మరించినట్లు తెలుస్తుంది.సుమారు 30 సంవత్సరాలు నియోజకవర్గంలో సిపియం తిరుగులేని సత్తాచాటింది. రాష్ట్ర విభజన తరువాత కమ్యూనిస్టులకు పట్టు తగ్గిపోయింది. గతంలో నియోజకవర్గంలో ఏసమస్య ఉన్నా కమ్యూనిస్టులు వేల సంఖ్యలో వొచ్చి రాస్తారోకోలు, ర్యాలీలు చేసి అధికారులను నిలదీసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టులు చేసే కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఏమాత్రం లేదు. ఎంతో కాలంగా సిపిఐ పార్టీలో ఉన్న అతిముఖ్యమైన నాయకులు బుధవారం నాడు కాంగ్రెస్ అభ్యర్ధి పొందెం వీరయ్య సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే పరిస్ధితి ఏర్పడిరది. దీనికి నాయకత్వం సరిగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. పొత్తులు ఉన్నప్పటికి రహస్యంగా ఒప్పందాలు పెట్టుకుంటూ ప్రజలకు దూమవుతున్నారు. సిపియం పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్ధితి ఏర్పడిరది. కానీ నియోజకవర్గ ప్రజలు గెలిపించేందకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న సిపిఐ పార్టీ బిఆర్‌ఎస్‌పార్టీకి పద్దతు తెలుపుతున్నట్లు విమర్శలు వినపడుతున్నాయి. ఖచ్చింతంగా బిఆర్‌ఎస్ అభ్యర్ధిని గెలిపించాలని సిపిఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నప్పటికి సిపిఐ వోట్లు కాంగ్రస్‌కు పడే అవకాశం ఏమాత్రం కనపడటంలేదు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరికమేరకు బిఆర్‌ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావును గెలిపించి మంత్రి మాట నిలబెట్టుకోవాలనే సిపిఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్, బిఆర్‌ఎస్, సిపియం పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలు ఏపార్టీని ఆదరిస్తారో వేచిచూడాలి.
———————