సివిల్ సప్లై, ఎఫ్.సీ.ఐ అధికారులతో మిల్లర్ల వేల కోట్ల కుంభకోణం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 :  సివిల్ సప్లై, ఎఫ్ సీఐ అధికారులతో కుమ్మక్కయ్యి మిల్లర్లు వేల కోట్ల ధ్యాన్యాన్ని తమిళనాడు కేంద్రంగా ఇతర దేశాలకు, రాష్ట్రాకు తరలిస్తున్నారని కన్సల్టేటివ్ కమిటీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సత్యమూర్తి ఆరోపించారు. దీంతో వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో ఎఫ్.సీ.ఐ, సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వ గోడౌన్లలో స్థలం లేదనే వంకతో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తమిళనాడులోని నాగ పట్నం కేంద్రంగా అక్రమంగా విదేశాలకు తరలిస్తూ అక్రమంగా వేల కోట్లు అర్జిస్తున్నారని ఆరోపించారు. దీంతో వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారులకు ఎవరి వాటా వారికి అందుతూనే ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వాలకు ఎలక్షన్ ఫండ్ పేరిట చెల్లిస్తున్నామని మిల్లర్లు బాహాటంగానే చెప్తున్నారని అన్నారు. ఇటీవల కొంతమంది మిల్లర్లను నిలదీయగా తాము సీఎం కేసీఆర్ నే తబ్బుదోవ పట్టించామని బాహాటంగా తెలిపారని చెప్పారు. నిలువ చేసిన ధాన్యాన్ని ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వకపోతే కొంత మొత్తంలో ఫైన్ కట్టాల్సి ఉంటుందన్నారు. ఇదే సాకుతో మిల్లర్లు జరిమానాలు కడుతూ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తూ కోట్ల రూపాయలు అర్జిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూడడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఈ భారీ కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు నిఘా ఏర్పాటు చేసి ఈ స్కామ్ లో ఉన్న అధికారులు, మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సంస్థ వద్ద ఈ బ్లాక్ మార్కెట్ దందాపై అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు బూర సురేందర్ గౌడ, మహ్మద్ రిజ్వాన్, గౌతమ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page