సి వోటర్‌ ఒపీనియన్‌ ‌పోల్‌ .. అధికారానికి చేరువలో ‘హస్తం …’..

కాంగ్రెస్‌కు  48 నుంచి 60 సీట్లు ..బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు..
రెండంకెలు దాటని బీజేపీ

సి వోటర్‌  ఒపీనియన్‌ ‌పోల్‌ ‌నిజమైతే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌దాదాపు 39 శాతం  వోటు  షేర్‌ ‌సాధిస్తుంది, ఆ తర్వాత బీ ఆర్‌ ఎస్‌  37‌శాతం  వోట్లను పొందుతుంది.

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 25: ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీవోటర్‌ ఓపీనియన్‌ ‌పోల్‌ ‌నిర్వహించిన ఏబీ పీ లైవ్‌ ‌వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఫలితాల ఆధారంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు (కేసీఆర్‌) ‌నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), ‌కాంగ్రెస్‌ ‌మధ్య గట్టి పోటీ ఉంటుందని ఒపీనియన్‌ ‌పోల్‌ అం‌చనా వేసింది. బీఆర్‌ఎస్‌ 43 ‌నుంచి 55 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయ సేకరణ లో తేలింది .. మరోవైపు కాంగ్రెస్‌ 48 ‌నుంచి 60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలో తన సీనియర్‌ ‌నాయకులను ప్రచారం కోసం రంగంలోకి దింపినప్పటికీ, 5 నుండి 11 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉండగా, 60 సీట్లు సాధించిన పార్టీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు.సీ వోటర్‌ ఒపీనియన్‌ ‌పోల్‌ అం‌చనాలు సరి అయితే , రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌దాదాపు 39 శాతం వోట్ల వాటాను పొందుతుంది, బీ ఆర్‌ ఎస్‌ 37 ‌శాతం వోట్లను పొందుతుంది, ఇది గత ఎన్నికలతో పోలిస్తే 9.4 శాతం తగ్గుతుంది.

సీవోటర్‌ ‌సర్వే ప్రకారం రాష్ట్రంలో బీజేపీ 9.3 శాతం నుంచి 16 శాతం వోట్లను సాధిస్తుంది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు బీ ఆర్‌ ఎస్‌,‌బీజేపీ మరియు కాంగ్రెస్‌ ‌పార్టీ విస్తృతంగా ప్రచారం లో ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ‌మరో పర్యాయం ఆశలు పెట్టుకోగా, కేసీఆర్‌ ‌మూడోసారి ముఖ్యమంత్రి కాకూడదని కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోంది. బిజెపికి, 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో దక్షిణ భారతదేశంలో తన ఉనికిని మరియు పట్టును బలోపేతం చేయడానికి తెలంగాణ ఎన్నికలు ఒక అవకాశం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌-‌తెలంగాణ రాష్ట్ర సమితి) 119 స్థానాలకు గాను 88 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 19 సీట్లతో కాంగ్రెస్‌ ‌రెండో స్థానంలో నిలిచింది. పోటీ చేసిన 117 స్థానాలకు గానూ బీజేపీ ఒక్కటి మాత్రమే గెలుపొందడంతో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది

.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
సీ వోటర్‌ ఒపీనియన్‌ ‌పోల్‌ ‌ఫలితాలు

బీ ఆర్‌ ఎస్‌  43-55
‌కాంగ్రెస్‌ ‌పార్టీ  48-60
బీజేపీ 5-11
ఇతరులు 5-11
మొత్తం సీట్లు 119

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page