పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: యశస్విని ఆల్ ఉమెన్ సూటార్క్లిట్ ఎక్స్ పెడిషన్-2033 పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న మోటార్సెక్టిల్ ర్యాలీని బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సాదరంగా స్వాగతించి ఆతిథ్యం ఇచ్చారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. చంద్రశేఖర్- ఐఏఎస్, సీఆర్ పీ.ఎఫ్. డింజ్ అనిల్ మింగ్, కమాండెంట్ ఎర్నల్ మోచి బెశ, అసిస్టెంట్ కమాండెంట్ కిషోర్, గీతం రెసిడెంట్ డెరెక్టర్ డివిపిఎస్ ఆర్ వర్మ, జిల్లా సంక్షేమ అధికారిణి సీహెచ్ సంధ్యారాణి, సాధన స్వచ్చంద సంస్థకు చెందిన పి.మధుసూదన్ రెడ్డి, తదితరులు మహిళా బెక్ రెడ్డర్లను దుశ్శాలువ, పురుగుచ్ఛాలతో స్వాగతించారు.సీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సురు నేతృత్వంలోని 60 మంది సభ్యుల బృందం (అందులో తెలుగు రాష్ట్రాల వారు 25 మంది) కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ఆరంభించి గుజరాతి లోని ఏక్తా నగర్కు చేరుకోవాలని. సంకల్పించారు. మార్గం మధ్యలో కొంత సమయం గీతమ్ లో అగి యువతతో జాతీయ సమగ్రత, సమైక్యతలను ప్రేరేపించారు. బేటీ బరావో, బేటీ పడావో’ నారీ శక్తి’ సందేశాలను వ్యాప్తిచేసి లక్ష్యంతో వారు ఈ యాత్రను చేపట్టారు. ఈ బృంద సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు.
ఈ యాత్ర ఏకకాలంలో శ్రీనగర్, షిల్లాంగ్, కన్యాకుమారి నుంచి అక్టోబర్ 5న ప్రారంభమైంది. ఈ నెలాఖరు నాటికి మూడు బృందాలు 75 మోటారుసెకైళ్లపై 15 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా, దాదాపు పది వేల కిలోమీటర్లు సయనించి, గుజరాత్ లోని ఏక్తాననక్కు చేరుకుంటాయి.తన కలలను సాకారం చేసినందుకు వారి కుటుంబాలకు సీఆర్ పీఎఫ్ మహిళా అధికారులు కృతజ్ఞతలు. తెలియజేశారు. ఎలాంటి వివక్ష లేదా లింగ వ్యపాతం లేకుండా తను ఆకాంక్షలను సాధించడానికి, బాలికలందరికీ సమాన మద్దతు, అవకాశాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వారు నొక్కే చెప్పారు.ఈ సందర్భంగా గీతం, ఎంఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాగత న్ని త్యాలను అధికారులు అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ యాత్రకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా లింగ భేదం లేకుండా అందరి ఆకాంక్షలను ప్రోత్సహించే మద్దతు ఇచ్చే సమ్మిళిత వాతావరణాన్ని పెంపొందించడానికి గీతం కట్టుబడి ఉందని స్పష్టీకరించారు.