ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : సీఎం సహాయనిధి పేదలకు వరమని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. సీఎం సహాయనిధి ఉందనే భరోసాతో పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. దానితో పేద ప్రజలు సకాలంలో మెరుగైన వైద్యాన్ని పొందుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో ఈరోజు మండలలోని గానుగుమర్ల గ్రామపంచాయతీకి చెందిన సభావట్ జ్యోతికి మంజూరైన రూ. 20వేల సీఎం సహాయనిధి చెక్కును అలాగే హన్మస్ పల్లి గ్రామపంచాయతీకి చెందిన కంబాల సంతోష కు మంజూరైన రూ.7500 ల సీఎం సహాయనిధి చెక్కు జడ్పిటిసి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హంస మోతియా, ఉప సర్పంచ్ శారదా పాండు, వార్డు సభ్యులు శ్రీను నాయక్, భీమన్ నాయక్, సోమ్లా నాయక్, ప్రేమ్, జీడిఎన్ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్, నాయకులు పాండు, అంజి, శ్రీను, రమేష్, చందర్, తదితరులు పాల్గొన్నారు.