సీజనల్‌ ‌వ్యాధులు – జాగ్రత్తలు

గ్రీష్మంలో తీవ్రమైన ఎండ, వడగాడుపులతో ఇబ్బందిపడి ఋతుచర్యలో భాగంగా వర్ష ఋతువులోకి ప్రవేశించాం.
ఋతుచర్య అంటే కాలాన్ని అనుసరించి వాతావ రణంలో, భూమి ఉపరితలంలో వచ్చే మార్పులకనుగుణంగా మనల్ని మనం మలుచుకొని శరీరాన్ని, ప్రాణాన్ని,ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆచరించే చర్యలు.ఈ వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై జారూతున్న జల కణములచే ఒక వింత స్థితిలో ఉంటుంది.తదనుగుణంగా మన శరీరంలో మనకు తెలియకు ండానే రక్తము,జీర్ణరసాల ఉత్పత్తి హెచ్చు తగ్గులుగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో మన ఆకలిని జీర్ణశక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలి.జీర్ణాశయంలో జనించే ఎంజైమ్స్, ‌పాంక్రియాస్‌ ‌లో ఉత్పత్తి అయ్యే హార్మోనులు, చిన్న ప్రేవుల్లో, పెద్ద ప్రేవుల్లో తయారయ్యే సమస్త జీర్ణరసాల సమగ్ర ప్రక్రియ జీర్ణశక్తి.
అలాగే వేసవిలో ఎండిన, వాడిపోయిన మన శరీరంపై ఉన్న చర్మం, స్వేద నాడులు శుభ్రపడటమే కాదు కొత్త శక్తిని సంతరించుకునేందుకు సన్నద్దమయ్యే సందర్బం కూడఈ వర్షాకాలంలో మేఘాలచేత, నీటి బిందువుల చేత ఆకాశం కప్పబడి ఉంటుంది. సూర్యరశ్మి ఉండదు కాబట్ఠి పులుపు, ఊప్పు కలిగిన నూనేతో చేసిన వేడి పదార్థాలు తినడం మంచిది.ఈ కాలంలో మనమే కాదు క్రిమికీటకాదులు కూడా వర్షంలో తడిసిన నేలపై ఉండలేవు.అవి ఇండ్లలోకి వచ్చి మనకు హాని చేస్తాయి. కాబట్టి….
మన ఇంటిలోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ వర్ష ఋతువు భూమిలో ఉండే సకల జీవరాశులకు తర్ప లాన్నిస్తుంది.
భూమి పులకించి తనలోని అమృతాన్ని తీసుకొమ్మని ఆహ్వాని స్తుంది. మనం ప్రకృతిలోని సౌభాగ్యాన్ని ఆస్వాదిస్తే మనకింత అన్నం పెట్టడానికి హలంతో రైతు పొలంలో నిలుస్తా డు.
ఇలావర్షంతో వచ్చే లాభాలతో పాటు అనారోగ్యాలవంటి నష్టాలూ ఉన్నాయి.వర్షంలో వరదలు ఒక రకమైన ఇబ్బంది అయితే ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, జబ్బులు కూడా మరో రకమైన ఇబ్బందిని కలిగిస్తాయి.ఈ వర్షాకాలంలో వచ్చే మరో బాధ గొంతు పట్టుకుపోవడం. గొంతులో కఫం చేరడం, జలుబు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరంభ దశలోనే కషాయం, గోరు వెచ్చని నీరు, మిరియాల పాలు, పసుపు కలిపిన పాలుతాగడం వలన గొంతు సమస్యలను అధిగమించవచ్చు.ముఖ్యంగా ఈ వర్షాకాలంలో బజారులో చల్లారి పోయిన పాత్రలపై కప్పబడనటువంటి తినుబండారాలను అసలు తిననేకూడదు  తింటే వాంతులు విరోచనాలకు ఆహ్వానం పలికిన వారమవుతాం.విరోచనాలు, కలరా, టైఫాయిడ్‌, ‌కామెర్లతో పాటు మన పరిసరాలలో ఉండే నీటి మడుగులలో..మన ఇండ్లలో
ప్లాస్టిక్‌ ‌పాత్రలు, పాత టైర్లు, ఎయిర్‌ ‌కూలర్లు, కుండలు వంటి వాటిలో నీరు నిలిచి అవి దోమల పెరుగుదలకు స్థావరా లవుతాయి.
కొన్ని జాతుల దోమలు మనిషిని కుట్టి రక్తం పీల్చుకుంటె..
మరికొన్నిరకాల దోమలు మనల్ని కుట్టి వ్యాధి కారక వైరస్‌ ‌లను మన శరీరంలో ప్రవేశ పెడుతాయి.ఫలితంగా బోదకాలు, మలేరియా, డెంగ్యూ, చికెన్‌ ‌గునియా ప్రబలే అవకాశం కూడ ఉంది.కాబట్టి ముందుగా మన ఇంటిలో ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిలువ ఉండకుండా దోమలు పెరుగకుండా చూసుకోవాలి.ఇంటిలోకి దోమలు రాకుండా మ్లెష్‌ ‌డోర్‌ ‌లు ఏర్పాటు చేసుకోవడం, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించి పిల్లలు,పెద్దలు మరియు వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఏ చిన్న జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు విష జ్వరాల వైరస్‌ ‌లు సోకకుండా జాగ్రత్త పడాలి.లేనిచో కడుపులో ఉన్న శిశువు యెక్క శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది.
మానవ శరీర బరువులో 60 శాతం నీరే ఉంటుంది.నీరు రక్తంలోనూ శరీరంలోని ఇతర ద్రవాలలోను ఉంటుంది.శరీరం నీటిని చెమట మరియు మలమూత్రాల రూపంలో నష్టపోతుంది.దీనిని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని తాగి భర్తీ చేసుకోవాలి.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు సుమారు ఐదు లీటర్ల నీటిని తాగాలి అయితే నీరు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే అందులో రోగ కారక క్రిములైనటువంటి బాక్టీరియా, పరాన్నజీవులు, వైరస్‌ ‌లు ఉండకూడదు. అలాగే క్రిమి కీటకాలు, పారిశ్రామిక వ్యర్థాలు, భారలోహాలు, నైట్రేట్‌ ‌లు ఎక్కువ మొత్తం లో ఫ్లోరైడ్లు ఉండడం మంచిది కాదు.ఎముకలలో దోషాలు, దంతాల సమస్యలకు కారణమయ్యే ఫ్లోరోసిస్‌ ‌జబ్బు ఎక్కువ కాలం పాటు అధికంగా ఫ్లోరైడ్‌ ‌కలిగిన నీటిని తాగడం వలన ఏర్పడుతుంది.సాధారణంగా లీటరు నీటిలో 0.5 నుండి 0.8 మి.గ్రా. ఫ్లోరైడ్‌ ‌మాత్రమే ఉండాలి. ఇందకు అనుగుణంగా ఆయా ప్రాంతాల ఫిల్టరు బెడ్లను పట్టణ, గ్రామీణ ప్రాంతాల జలశాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాలి.
అయినప్పటీకి నీటి ప్రవాహధాటికి  పైపులు డామేజ్‌ ‌కావడంతో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం తాగే నీరు సురక్షితం కానపుడు 10 నుండి15 నిమిషాల పాటు మరిగించి సంతృప్తికరంగా శుభ్రపరచడం మంచిది అలా చేస్తే రోగ కారక క్రిములన్ని నాశనమై తాత్కాలిక కఠినత్వం కూడా పోతుంది.ఇలా శుభ్రమైన నీటిని వాడడం ద్వారానే మనం ఆరోగ్యంగా జీవిస్తాము కనుక మంచి నీళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
image.png
నరేందర్‌ ‌రాచమల్ల
9989267462

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page