సూర్యుని పిల్లలలో అసూయ, ద్వేషం ఉండదు

ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టాలని ఎదురుచూస్తున్న దంపతులు ఒక్క సారిగా సంతోషం వెళ్ళి విరిసింది. తన భార్య ఒక బిడ్డకు జన్మనిస్తోందని ఆ భర్త సంతోషానికి అవధులు లేక పోయాయి. క్షణాలుగానే 9 నెలలు గడిచి పోయాయి. ఆ ఇల్లాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. భగవంతుడికి  వీరి సంతోషాన్ని చూసి ఈర్శ పుట్టిందో ఏమో  బోసి నవ్వులతో ఈ ప్రపంచంలోని ఆనందమంతా రాశులుగా పోసినట్టుండాల్సిన చిన్నారి అందుకు భిన్నంగా  ఆ బిడ్డ డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌తో పుట్టింది. అయినా ఆ తండ్రి క్రుంగి పోలేదు, ఆ తల్లి బాధ పడలేదు. అందరి లాగానే తమ బిడ్డను పెంచారు. ఈ రోజు ఆ పాప అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. తనకు తానే సాటి అని చెషైర్‌ ‌కు చెందిన గ్రేస్‌ ఇసాబెల్లా వార్టన్‌ ‌నిరూపించుకుంది. డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న చాలా మంది ప్రసిద్ధ వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలరని నిరూపించారు. డౌన్‌ ‌సిండ్రోమ్‌ అనారోగ్యం కాదు
సాధారణంగా ప్రతి వ్యక్తిలో తల్లి నుండి 23 తండ్రి నుండి 23 వారసత్వంగా వచ్చిన 46  క్రోమోజోమ్‌లుంటాయి. 21 వ జత క్రోమోజోమ్‌ ‌లో అదనపు క్రోమోజోమ్‌ ‌తో 47 క్రోమోజోములు ఏర్పడటాన్ని డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌గా పేర్కొంటారు.
డౌన్‌ ‌సిండ్రోమ్‌ అనేది అనారోగ్యం కాదు, ఇది కణ విభజనలో లోపం అదనపు క్రోమోజోమ్‌ 21 ‌కు దారితీసినప్పుడు సంభవిస్తుంది. డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఒక వ్యక్తి యొక్క అభిజ్ఞా సామర్థ్యాన్ని మరియు శారీరక పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తులు సాధారణంగా విభిన్న శారీరక లక్షణాలు, ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు మరియు అభిజ్ఞా వికాసంలో వైవిధ్యతను కలిగి ఉంటారు.
సూర్యుని పిల్లలు:డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న పిల్లలు చాలా ఆప్యాయంగా, ఫన్నీగా, దయగా ఉండటం గమనించవచ్చు. ఇతరులను ఎలా ద్వేషించాలో, అబద్ధం, అసూయ లేదా హాని చేయాలో వారికి తెలియదు. అందువల్ల, వారిని ‘‘ప్రత్యేక’’ లేదా ‘‘సూర్యుని పిల్లలు’’ అని పిలుస్తారు.
ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన అవసరం
డౌన్‌ ‌సిండ్రోమ్‌తో జన్మించిన దాదాపు 50% మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె సమస్యను కలిగి ఉంటారు. డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్నవారికీ చెవి ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. స్లీప్‌ అప్నియా నిద్రలో గురక మరియు గురక వంటి పరిస్థితులకు కూడా కారణమవుతుంది. శిశువుకు జీర్ణశయాంతర లోపాలు ఏర్పడవచ్చు. అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటారు. కంటిశుక్లం వంటి కంటి సమస్యలు ఏర్పడే అవకాశం. థైరాయిడ్‌ ‌హార్మోన్‌ ‌స్రావం చేయడంలో పిల్లలకి సమస్యలు ఉండవచ్చు. డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న శిశువులు మరియు పసిబిడ్డలు ఇతరులతో పోల్చినప్పుడు ఆలస్యమైన అభిజ్ఞా వికాసం కారణంగా నెమ్మదిగా నేర్చుకునేవారు. వారి ఐక్యూ కూడా తక్కువ స్కోలిస్టిక్‌ ‌వెనుకబాటుతనానికి కారణమవుతుంది.
డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌ను శాసించిన ఏడేళ్ళ బాలిక
పుట్టుకతో డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌కలిగిన ఒక ఏడేళ్ల బాలిక, పిల్లల మోడలింగ్‌ ‌ను తన వృత్తిగా మలచుకుని విజయపథంలో నడుస్తూ  అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందీ చెషైర్‌ ‌కు చెందిన గ్రేస్‌ ఇసాబెల్లా వార్టన్‌. ‌డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌తన జీవితాన్ని శాసించకుండా తీర్చిదిద్దుకుంది. కెమెరా ముందు గ్రేస్‌, ‌తనను తాను ఒక ముగ్ధమనోహరమైన బాలికగా మలచుకుంటుంది. కెమెరా ముందుకు వచ్చిన ప్రతిసారీ, ఆమెలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
ఇంగ్లీష్‌ ‌ఛానెల్‌ ‌ను ఈదిన డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌కరెన్‌
‌డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌కలిగిన కరెన్‌ ‌గాఫ్ఫ్నీ ఇంగ్లీష్‌ ‌ఛానల్‌ ‌ను ఈది చరిత్ర సృస్టించింది. అక్కడితోనే ఆగని కరెన్‌ ‌పారా ఒలింపిక్‌ ‌క్రీడలలో ఎన్నో  బంగారు పథకాలను సొంతం చేసుకుని తన సత్తాను చాటింది. కరేన్‌ ‌సేవలకు గుర్తింపుకు గాను యూనివర్శిటీ ఆఫ్‌ ‌పోట్లాండు గౌరవ డాక్టరేట్‌ ‌తో సత్కరించింది. కరేన్‌ ‌వికలాంగుల పిల్లలకు సేవలు అందించడానికి కరేన్‌ ‌గాఫ్ని ఫౌండేషన్‌ ‌పేరుతో స్వచ్ఛంధ సంస్థను  స్టాపించింది.
డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌వ్యక్తులు – కరోనాతో జాగ్రత్తా డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తులకు కరోనా సోకితే లక్షణాలు అధికంగా ఉండటంతో పాటు, ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని పరిశోధనల ఫలితాలు తెలియచేస్తున్నాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న వ్యక్తులు మూడు రెట్లు ఎక్కువగా కరోనా ప్రభావానికి, మరణానికి గురయ్యే అవకాశాలున్నట్లు, భారత్‌లో సంవత్సరానికి సుమారు 30 వేల డౌన్‌ ‌సిండ్రోమ్‌ ‌కేసులు నమోదవుతున్నట్లుగా లాన్సెట్‌ ‌జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా వివరాలు తెలియ చేస్తున్నాయి. శారీరక, మానసిక ఎదుగుదలను ఆపేసే జన్యుపరమైన సమస్య డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్నవారిని హై-రిస్క్ ‌జాబితాలో చేర్చి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్‌ ‌పంపిణీ కార్యక్రమంలో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలి.
డౌన్‌ ‌సిండ్రోమ్‌  ‌పిల్లలతో అద్భుతాలు
పిల్లలకు చికిత్స కలిగిస్తూనే పిల్లల పట్ల శ్రద్దను చూపుతూ ఉంటే డౌన్‌ ‌సిండ్రోమ్‌  ‌పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు. డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న పిల్లలకి చికిత్స చాలా ముఖ్యమైనది. పిల్లలు సమాజంలో రాణించడానికి దోహదం చేస్తుంది. పిల్లవాడిని ఇతర పిల్లలతో ఆడుకోవడానికి, కలపడానికి, మాట్లాడటానికి మరియు కలుసుకోవడానికి ప్రోత్సహించాలి. డౌన్‌ ‌సిండ్రోమ్‌ ఉన్న పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికి అవసరమయ్యే సానుకూల ఉపబలమే ప్రేరణ. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు.
image.png
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page