సైబర్ మోసాలను నమ్మి మెసేజ్ రాగానే ఆశపడి మోసపకండి అప్రమత్తంగా ఉండండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: లోన్ యాప్,, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో   సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి.ఈ సంవత్సరం ఈ రోజు వరకు  57,79,809 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. త్వరలో విడతలవారీగా సంబంధిత బాధితుల అకౌంట్లో,  బ్యాంకుల ద్వారా జమవుతాయి.సైబర్ నేరగాళ్లు *ఆశ, భయం* అనే రెండు అంశాల మీద సైబర్  నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.నకిలీ లాటరీలు,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ ,పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు.సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలుమీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.మీ SBI YONO బ్లాక్ అయిందని PAN CARD అప్డేట్ చెయ్యమని వచ్చే మెసేజులు నమ్మకండి, ఇందులో ఉన్న లింక్స్ పై క్లిక్ చెయ్యకండిసోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.సిద్దిపేట జిల్లా పరిధిలో గత 3 రోజుల నుండి  జరిగిన సైబర్ నేరల యొక్క వివరాలు .
1. చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి  మీరు ఒక 12, 80,000/- లక్షల రూపాయల గెలుచుకున్నారని ఫోన్ చేయగానే అది నమ్మిన బాధితుడు వెంటనే దానికి సంబంధించిన జిఎస్టి  ఇతర చార్జీల గురించి డబ్బులు పంపించినచో  మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని చెప్పగానే  సైబర్ నేరగాడు పంపించిన ఫోన్ నెంబర్ కు  38,400/- రూపాయలు పంపించాడు. తదుపరి ఆ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది.
2. రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి  గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి  దని పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ అని పరిచయం చేసుకొని  లక్ష రూపాయల రోన్ మంజూర అయిందని అప్రూవల్ చేయడానికి ప్రాసెసింగ్  చార్జీలు జీఎస్టీ డబ్బులు కట్టాలని చెప్పగానే సదరు బాధితుడు ఆశపడి  15,500/- పంపించినాడు తదుపరి ఆ నెంబర్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది.3. భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడు తన ఫోన్లో ఏఏ క్రెడిట్ లోన్ యాప్ ను ఇన్స్టాల్ చేశాడు, తన కాంట్రాక్ట్ యాక్సెస్ చెయ్యగానే గుర్తు తెలియని సైబర్ నేరగాడు  బాధితురాలికి వివిధ రుణ యాప్ ల నుండి   మొత్తం 90 వేల రూపాయలు క్రెడిట్ చేసినాడు, క్రెడిట్ చేసి 90 వేల రూపాయలు చెల్లించాలని నిరంతరం కాల్ చేస్తూ బాధితుడిని వేధిస్తున్నాడు, లేదంటే ఫోటోలు న్యూడ్ గా తయారుచేసి నీ కాంటాక్ట్ లో ఉన్న అన్ని నెంబర్లకు సెండ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయగా అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది.*వారు వెంటనే  స్పందించి 90,000 /- వేల రూపాయలు ఫ్రిజ్ చేయడం జరిగిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page