వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా తాత్కాలికంగా రద్దు చేయబడిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ఈనెల 11న ( సోమవారం) నుండి యధా విధిగా నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.