గ్లోబెల్ బ్రాండ్ అంబాసిడర్లు
అసుర వారసత్వ ఆనవాళ్లు
అబద్దాలకు నికార్సు నకళ్ళు
అవే సోషల్ మీడియా డెవిల్స్
అసత్య ప్రచార గొర్రె మెదళ్ళు
అసభ్యతకు జైకొట్టే వెర్రినోళ్లు
అనాగరికపు చేష్టల కొర్రీమళ్ళు
అవే సమాజానికి సోకిన తెగుళ్లు
సామాజిక మాధ్యమ వేదికగా
విద్వేష విషం వెళ్లగక్కుతాయ్
దేశభక్తి ముసుగు వేసుకుని
నికృష్టపు ట్రోలింగ్ సాగిస్తాయ్
యదార్థాలను సమాధి చేసి
వదంతుల ప్రచారం చేస్తాయ్
తమకు గిట్టని వ్యక్తుల పట్ల
తిట్ల దండకానికి దిగుతాయ్
అక్రమ సంబంధాల అంటగట్టి
వికృత సందేశాల్ని సంధిస్తాయ్
లోగుట్టు క్రతువుల బంధించి
నేటిజన్ల మీదకు గుప్పిస్తాయ్
గాలి కబుర్లు శ్వాసిస్తాయ్
బూతు పదాల భుజిస్తాయ్
హేట్ న్యూస్ స్రవిస్తాయ్
ఫెకింగ్ పిక్టర్స్ ప్రదర్శిస్తాయ్
ఇవి ఊరు పేరులేని పోకిరీలు
వెట్టికి పుట్టిన పుట్టగొడుగులు
ఈ చీడల దండుల కడతేరిస్తేనే
ఈ తెగుళ్ళ వేళ్ళు తెగనరికితేనే
సోషల్ మీడియా అస్తిత్వం సుస్థిరం
సామాజిక విలువలు సదా విరచితం
(సోషల్ మీడియా పోకిరీలకు హెచ్చరికగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493