సో’సెల్‌’ ‌మీడియా విష వలలో చిక్కిన లేత భారతం..!

కొరోనా మహమ్మారి కాలంలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరుతో పిల్లలకు, కౌమార యువత చేతుల్లో స్వార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెట్టిన తల్లితండ్రులు నేడు ఆ అలవాటుకు బానిసలైన పిల్లలను అదుపు చేయలేక దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. పిల్లలు, కౌమార యువతకు పట్టిన ఇంటర్నెట్‌ ‌పీడను విరగడ చేయడానికి ఏ మార్గం దొరకడం లేదని, వారించినప్పటికీ పిల్లలు మారాం చేస్తున్నారని, ఎంత బుజ్జగించినా వినడం లేదని, ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమని వాపోతున్నారు. పట్టణ ప్రాంత బాలలు 61 శాతం స్మార్ట్‌ఫోన్‌ ‌తెరలకు అతుక్కుపోతున్నారని, వీరిలో ప్రతి ముగ్గురులో ఒక్కరు అనగా దాదాపు 33 శాతం చిన్నారులు డిజిటల్‌ ‌తెరల దురలవాటుకు లోనయ్యారని, ఈ దుర్వాసనం కారణంగా ఆవేశ దూకుడు పెరగడం, నీరసపడడం, నిరాశల విష వలయంలో చిక్కుకొని తమ భవితను నాశనం చేసుకునే స్థాయికి చేరుతున్నారనే తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.  పట్టణప్రాంత 18 ఏండ్ల లోపు పిల్లలు సోషన్‌ ‌మీడియా (ఓటిటి, వీడియో, ఆన్‌లైన్‌ ‌గేమ్‌, ‌పోర్న్ ‌ప్లాట్‌ఫామ్స్ ‌లాంటివి) వాడడానికి పరిమితులు, అనుమతులు తీసుకునేలా ప్రభుత్వాలు ‘డిజిటల్‌ ‌ప్రైవేట్‌ ‌డాటా ప్రొటెక్షన్‌ ‌లా’ లాంటి చట్టం తీసువచ్చేలా చర్యలు చేపట్టాలని 73 శాతం మంది తల్లితండ్రులు కోరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

రోజుకు గంటల పాటు తెరల ముందు:
అంతర్జాల తెరల్లో మునకలు వేస్తున్న 9 – 17 ఏండ్ల యువత లేదా పిల్లల్లో 15 శాతం వరకు రోజుకు 6 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌, ‌ట్యాబ్‌, ‌లాప్‌టాప్‌ ‌లేదా ఇతర డివైజెస్‌ ‌వాడుతున్నట్లు, 46 శాతం పిల్లలు రోజుకు 3 – 6 గంటలు, 39 శాతం బాలలు 1 – 3 గంటల పాటు డిజిటల్‌ ‌తెరలకు అతుక్కుపోతున్నట్లు ఇటీవల ‘లోకల్‌సర్కిల్స్’ అనబడే సంస్థ అధ్యయనాల్లో తేలింది. ఆన్‌లైన్‌ ‌సైట్లలో గంటల తరబడి గడుపుతున్న 39 శాతం బాలలు దూకుడుగా (అగ్రెసివ్‌గా), 37 శాతం మంది అసహనంగా, 22 శాతం నీరసంగా, 25 శాతం అతి చురుకుదనంగా (హైపర్‌ఆక్టివ్‌గా), 27 శాతం నిరాశగా ఉంటున్నట్లు అధ్య యనం తేల్చింది. ఇంటర్‌నెట్‌ ‌వాడే పిల్లల్లో 8 శాతం సంతోషంగా, 10 శాతం కలివి డిగా ఉంటున్నారని తెలుస్తున్నది.

అందుబాటులో ఉన్న పలు రకాల సామాజిక మాద్యమాలు:
సామాజిక మాద్యమాల వాడకంలో 9 – 17 ఏండ్ల పిల్లలు/కౌమార యువతలో 35 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌, ‌వాట్స్అప్‌, ‌స్నాప్‌షాట్‌ ‌వేదికలను వాడుతున్నారని, 37 శాతం మంది వీడియో, యూట్యూబ్‌, ‌ప్రైమ్‌, ‌నెట్‌ఫ్లిక్స్, ‌హాట్‌స్టార్‌ ‌లాంటి వేదికల్లో గంటల తరబడి కాలం గడుపుతున్నారని తేలగా, 33 శాతం ఆన్‌లైన్‌ ‌గేమ్స్ ఆడుతున్నారని విశ్లేషించారు. 18 ఏండ్ల లోపు పిల్లలు/కౌమార యువత అంతర్జాల వేదికలను వాడడానికి తల్లితండ్రుల అనుమతి తీసుకోవాలని 73 శాతం మంది పేరెంట్స్ ‌భావిస్తుండగా, 13 శాతం మంది పేరెంట్స్ ‌మాత్రం 15 ఏండ్లు దాటిన కౌమార యువతకు ఎలాంటి ఆంక్షలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఇంటర్నెట్‌ ‌దురలవాటు దుష్ప్రభావాలు:
స్మార్ట్‌ఫోన్‌, ‌ట్యాబ్‌, ‌లాబ్‌టాప్‌ ‌లాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను రోజుకు పలు గంటలు వాడుతున్న 9 – 18 ఏండ్ల పిల్లలు/కౌమార యువతలో తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతున్నట్లు నిర్థారణ అయ్యింది. నెట్టింట్లో అనేక గంటలపాటు తెరలకు అత్తుకుపోతున్న పిల్లలు/కౌమార యువతలో ఓపిక లేకపోవడం, ఆవేశపడడం, ఉద్రేకపడడం, ఏకాగ్రతను కోల్పోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి సమస్యలు, కంటి జబ్బులు, వెన్నునొప్పి, ఒత్తిడి, ఆందోళన, సంభాషణనా సమస్యలు, సోమరితనం, నిరాశ లాంటి అవలక్షణాల పాలు అవుతున్నారని అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.
‘లోకల్‌సర్కిల్స్ ‌సంస్థ’ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 296 జిల్లాలో నుంచి 46,000 మంది పట్టణ ప్రజల అభిప్రాయాలను, అందులో 38 శాతం మహిళల మనోభావాలను రికార్డు చేశారు. అంతర్జాల విష వలలో చిక్కకుండా 8 శాతం మంది బాలలు/కౌమార యువత మాత్రమే ఆన్‌లైన్‌ను వినియోగించినప్పటికీ తమ నియంత్రణలో ఉంటూ సంతోషంగా ఉన్నారని తల్లితండ్రులు పేర్కొనడం మిగిలిన 92 శాతం మంది పరిస్థితిని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నది. ఒకప్పుడు జూదం, తాగుడు, పొగాకు లాంటి దురలవాట్లకు అలవాటు పడిన జనులు ఉండేవారు.
నేడు యువత ముంగిట డ్రగ్స్, ఇం‌టర్నెట్‌, ‌పబ్స్, ‌రేవ్‌ ‌పార్టీలు లాంటి ఆధునిక హంగులు వండి వార్చే కల్చర్‌ ‌పెరగడంతో డిజిటల్‌ ‌యుగపు బాలలు, కౌమార యువత, యువతీయువతకులు నవ్య దురలవాట్లకు బానిసలై రేపటి భవితను బుగ్గిపాలు చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ పరిస్థితులను గమనిస్తూ తల్లితండ్రులు, సమస్త సమాజం, ప్రభుత్వ శాఖలు సమన్యయంతో నేటి బాలలను టెక్నాలజీ దుర్వినియోగ ఊబిలో పడకుండా సంరక్షించుకునే బాధ్యతను భుజాన వేసుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే నేటి దురలవాట్ల యువతే రేపటి అనారోగ్య భారతం అవుతుందని తెలుసుకోవాలి.
image.png
డా. బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి        

       కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page