సౌర విప్లవమే భూతాపానికి పరిష్కారం

‘‘‌శాశ్వత పరిష్కారం రావాలి అంటే శిలాజ ఇంధనాల దహనం నిలిపి వేయాలి. అలా ఒక్కసారిగా ఈ చర్యకు పాల్పడితే ప్రపంచం మొత్తం నిలిచిపోతుంది. ఇది సాధ్యపడే విషయం కాదు. అయితే దీనికి అత్యుత్తమ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా సాంప్రదాయేతర వనరులు లేదా పునరుద్ధారక ఇంధన వనరులైన సౌర శక్తి, పవన శక్తిలను భారీగా వినియోగంలోకి తీసుకురాగలగాలి. ఈ రెంటిలో సౌరశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని నిపుణుల అభిప్రాయం.’’

ఒక దేశ అభివృద్ధిని ఆ దేశ తలసరి శక్తి వినియోగాన్ని బట్టి నిర్ణయిస్తారు… అయితే ప్రపంచంలో అన్ని దేశాలు నేడు ఈ శక్తి కోసం ఎక్కువగా సంప్రదాయ ఇంధన వనరులపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఈ వనరులు మాత్రం తిరిగి పొందలేనివి. వీటిని వినియోగిస్తున్నకొద్దీ తరిగిపోతూ ఉంటాయి. ఈ నిల్వలు పూర్తిగా అడుగింటి పోతే ప్రపంచం పెద్ద విపత్తును ఎదుర్కొంటుంది. అంతకన్నా ముఖ్యంగా శక్తి కోసం ఈ శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడే కర్బన ఉద్గారాల తీవ్రత వలన భూతాపం పెరిగిపోయి జీవకోటి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యింది. ఒకవైపు తరిగి పోతున్న సంప్రదాయ ఇంధన వనరుల లభ్యత, మరో వైపు పర్యావరణ విషతుల్యతతో పుడమి వేడెక్కుతోంది.

పారిశ్రామిక విప్లవానికి శిలాజ ఇంధనాల వాడకం ఆజ్యం పోసింది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. కానీ మన భూమి, మన పర్యావరణం అధ్వాన్నంగా మారాయి. శిలాజ ఇంధన జాతి కూడా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను సృష్టించింది. అయితే నేటి సాంకేతికత మనకు ఈ ప్రమాదం నుండి తప్పించుకునే ప్రత్యామ్నాయం అందించింది. కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టడం లేదా విడుదలైన వాటిని ఆధునిక సాంకేతికత విధానం ద్వారా కట్టడి చేయడం లేదా విడుదలైన కర్బనాలను శోషించే సాంకేతికతను అవలంబించి సమతూకం చేసి భూతాపాన్ని అదుపు చేయడం. ఇవన్నీ సాంకేతిక అందించిన ప్రత్యామ్నాయ మార్గాలు..

అయితే ఇవన్నీ తాత్కాలిక ఉపశమన పద్ధతులు మాత్రమే. శాశ్వత పరిష్కారం రావాలి అంటే శిలాజ ఇంధనాల దహనం నిలిపి వేయాలి. అలా ఒక్కసారిగా ఈ చర్యకు పాల్పడితే ప్రపంచం మొత్తం నిలిచిపోతుంది. ఇది సాధ్యపడే విషయం కాదు. అయితే దీనికి అత్యుత్తమ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా సాంప్రదాయేతర వనరులు లేదా పునరుద్ధారక ఇంధన వనరులైన సౌర శక్తి, పవన శక్తిలను భారీగా వినియోగంలోకి తీసుకురాగలగాలి. ఈ రెంటిలో సౌరశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని నిపుణుల అభిప్రాయం. ఈ కారణం చేతనే ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కాలుష్య రహిత సూర్య శక్తి వినియోగంపై చాలా చర్చలు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశాలు సౌర శక్తి ఉత్పాదకతపై కూడా దృష్టి పెట్టాయి. ప్రస్తుత, భవిష్యత్‌ ‌తరాల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శక్తి భద్రతను సాధించా లంటే సౌరశక్తి వంటి పునర్వినియోగ శక్తి వనరులపై ఆధారపడటం తప్పనిసరిగా మారింది.

పర్యావరణ పరిరక్షణకై ఏర్పాటు చేస్తున్న ప్రపంచ సదస్సులలో సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలన్నీ తీర్మానాలు చేస్తున్నాయి. అయితే ఒక్కసారిగా అది వీలు పడదని క్రమేపీ దానిని ముందుకు తీసుకువెళ్లాలని ఈ లోపు ఆధునిక సాంకేతికలను ఉపయోగించి కర్బన ఉద్గారాల తటస్థీకరణ చేయాలని, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలని, దీనికి ప్రపంచ దేశాలు సమిష్టిగా కృషి చేయాలని నెట్‌ ‌జీరో ఎమిషన్‌  ‌లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదే లక్ష్యంగా  కాప్‌ 26 ‌సదస్సులలో చర్చలు జరిగాయి. ఈ వేదికలో ప్రసంగించిన భారత ప్రధాని మాత్రం కర్బన ఉద్గారాలను కట్టడి చేసే ప్రయత్నాలు అన్నీ తాత్కాలికమే అని శాశ్వత పరిష్కారం అంటూ ఉంది అంటే అది కేవలం సౌర శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించడమే అంటూ.. ఒక సూర్యుడు ఒక పుడమి ఒక గ్రిడ్‌ అనే లక్ష్యాన్ని సదస్సులో ప్రపంచ దేశాల ముందు ఉంచారు. 2015లోనే సౌర శక్తిని ఒక గ్రిడ్‌ ‌రూపంలో మరలించి భూతాప సమస్యకు శాశ్వత పరిష్కారం తెచ్చే దిశలో అంతర్జాతీయ సౌర శక్తి కూటమి అనే దానిని భారత్‌ ‌కేంద్రంగా ఏర్పాటు చేశారు.

ఆ దిశగా అనేక ప్రపంచ దేశాలతో భారత ప్రధాని చర్చించారు. 120 వరకు దేశాలు ఈ ప్రతిపాదనకు ముందుకు కూడా రావడం జరిగింది. దానిని సాకారం చేసే దిశగా భారత్‌  ‌తాజాగా కీలక మైలురాయిని దాటింది.గుజరాత్‌ ‌లోని మొథేరా దేశంలోని తొలి సంపూర్ణ సౌర విద్యుత్‌ ‌గ్రామంగా అవతరించింది.వాతావరణ మార్పులు ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్న ఈ తరుణంలో మొదేరా పూర్తి స్ధాయి సౌర గ్రామంగా మారడం గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. ఈ ప్రపంచానికి అంతటికీ సూర్యుడు ఒక్కడే. సూర్యునిది ఆనంత శక్తి. ఆ శక్తికి క్షయం లేదు. అక్షయం కాని శక్తితో ప్రపంచానికి వెలుగు ఇస్తున్నాడు.

సూర్యుడు. కిరణజన్య సంయోగ క్రియకు మూలమై సమస్త జీవకోటికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఆ వెలుగులో మన శరీరానికి అవసరం అయిన విటమిన్స్ ఇస్తున్నారు. సాంకేతిక విప్లవంలో భాగంగా సూర్యుని వెలుగులను శక్తి మార్చుకోవచ్చు అని తెలిసిన తరువాత నెమ్మదిగా ఆయన శక్తివి.. వినియోగించుకుంటున్నాం. అనంతమైన సౌరశక్తిని సరిగ్గా వాడుకుంటే, అంతమవుతున్న సహజ వనరుల గురించి చింతించాల్సిన అవసరమే రాదు.
అయితే ఆ శక్తి ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం మాత్రం చాలా అధికం. అందుకే ఇంకా శిలాజ ఇంధన వనరులను విడిచి పెట్టలేక పోతున్నాం. ఈ వనరులు మాత్రం దానున్న కాలంలో హరించుకు పోవడం మాత్రం తథ్యం. రోజుకారోజు దానికి ప్రత్యామ్నాయం కోసం వేదికితే మాత్రం ప్రయోజనం కూన్యం. ఆ స్థితిలో సమస్త జీవ కోటికి ముప్పు తద్యం. ఈ సత్యం ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. అయినప్పటికీ మొత్తం విడులయ్యే కర్బన ఉద్గారాలలో మన వాటా ఆల్బమే కదా అనే రీతిలో ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఈ ధోరణి పుడమికి ముప్పు తెచ్చి పెడుతుంది. దీనిని అధిగమించి ప్రస్తుత తను ప్రయోజనాలతో పాటు భవిష్యత్‌ ‌తరాల వారిని కాపాడలంటే మనం అందరం సూర్యునితో కలసి నడవ వలసిన అవసరం తప్పనిసరి కానుంది. సూర్య శక్తి ప్రాధాన్యతను పరిశీలిస్తే.. మొత్తం మానవ జాతి ఒక సంవత్సరంలో ఎండ శక్తిని ఉపయోగిస్తుందో, సూర్యుడు ఒక గంటలో భూమికి అంతే శక్తిని ఇస్తారు. ఈ అపారమైన శక్తి పూర్తిగా స్వచ్చమైనది, అలాగే స్థిరమైనది.
అయితే సౌర శక్తి ఉత్పాదకత దేపట్టాలనే ఉత్సాహం దేశాలకు ఉన్న దాని అవరోదాలు కూడా వాటిని వెంటాడుతున్నాయి. అవేమిటంటే సౌర శక్తికి మూలం అయిన సూర్యుడు భూ భ్రమణం ప్రకారం 12 గంటలు మాత్రమే ఒక దేశ భూభాగంలో అందుబాటులో ఉంటారు. ఒక చోట అస్తమించినా. మరోచోట ఉదయించే సూర్యుని నుంచి 24 గంటలు శక్తిని పొదుపు చేయవచ్చు.

భూ ప్రపంచమంతా సూర్యుడు ఒకేసారి అస్తమించరు. మన పరిధిలో సూర్యుడు అస్తమించాడు అంటే వేరొక దేశంలో ఉదయిస్తున్నారు. అని అర్ధం. ఈ స్థితిలో 12 గంటల సూర్య శక్తిని మాత్రమే ఒక దేశ భూ భాగం ఉపయోగించుకోగలదు. అయితే ఈ 12 గంటల సమయంలో కూడా సూర్య శక్తిని పూర్తిగా ఉపయోగించుకోగలమా అంటే అది అవకాశం లేదు. ఎందుకంటే రుతువుల గమనం బట్టి దవి కాలం వర్షాకాలం సంభవిస్తాయి. ఈ సదు యంలో ముబ్బులు అధికంగా ఉండి సూర్య శక్తి అందుబాటులో ఉండదు. అందుచేత సూర్యశక్తి నిరంతర సప్లయ్‌ ‌కి అవకాశం ఉండదు. అదే శిలాజ ఇంధనాలు అయితే ఈ సమస్య ఉండదు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రపంచంలో కొన్ని దేశాలు సౌర శక్తి ఉత్పత్తి ఆరంభించాయి. ఈ నేపథ్యంలో మన ప్రధాని మదిలో ఒక సూర్యుడు, ఒకే భూమి, ఒకే గ్రీన్‌ అనే ఆలోచన పురుడు పోసుకుంది.

సౌరశక్తి రంగంలో భౌగోళికంగా మనకు ప్రధాన సానుకూల అంశం ఉంది. ఏమిటంటే భూగోళంపై కర్కాటక, మకర రేఖాంశాల నడుము ఏలా 300 రోజు లకుపైగా ఆపాద భాగుతాపం ప్రసరించే దేశాల్లో ఇండియా ఒకటి. దీనివలన భారత భూభాగంపై 5000 ట్రిలియన్‌ ‌కిలోవాబ్‌ అవర్ల సౌరశక్తి వచ్చి లేరు. తుంది. బహుశా సౌరశక్తిని ఏడాదిపాటు పొందగలిగే అవకాశం ఉన్న అరుదైన దేశం మనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకునే సౌరశక్తి రంగంలో అపార అవకాశాలను భారత్‌ ఉపయోగించుకునే ప్రయత్నాలు ప్రారంభం చేయడం జరిగింది. ఆ ఆలోచనతోనే మధ్యప్రదేశ్‌ ‌లోని దేవాలో. ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ ‌పార్కును కూడా ప్రారంభించడం జరిగింది.

సౌర శక్తి ప్రపంచంలోని ప్రతీ దేశానికి సమంగా లభించడం లేదు కనుక సౌరశక్తి ఎక్కువ లభించే దేశాలు ఆ శక్తిని తక్కువ సౌర శక్తి లభించే దేశాలకు పంపిణీ చేయడం లేదా సౌర శక్తి డిమాండ్‌ ఎక్కువగా గల దేశాలయ సౌర శక్తి డిమాండ్‌ అల్పంగా గల దేశాలు పంపిణీ చేయాలనే ఆలోచనే గ్లోబర్‌ ‌డ్‌ ఇరుగు పొరుగు దేశాలన్నింటి మధ్య ఒకే గ్రిడ్‌ ‌ద్వారా సౌర శక్తిని పంపిణీ చేయగలిగితే సత్ఫలితాలు సాధించవచ్చు. సౌర శక్తిని నిలువ చేసే అవకాశాలు. తక్కువ. కనుక ఒకే గ్రిడ్‌ ‌ద్వారా సౌర శక్తిని నిలువ చేయనవసరం లేకుండానే ఎప్పటికప్పుడు ఇవసర దేశాల మధ్య పందుకునే వీలు ఏర్పడుతుంది.

వరల్డ్ ‌వైడ్‌ ‌గ్రిడ్‌ అనేది క్లీన్‌ ఎనర్జీని ప్రతిచోటా అందుబాటులో ఉండేలా చేస్తుంది. అన్ని సమయాల్లో నిల్వ అవసరాన్ని తగ్గిస్తుంది. ఖర్చులను తగ్గించడమే కాకుండా, వివిధ ప్రాంతాలు, దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాన్ని కూడా తెలుస్తుంది. ఈ విషయమై భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రపంచానికి సోలార్‌ ‌కాలిక్యులేటర్‌ అప్లికేషను అందించబోతోంది. దీనితో, ఉపగ్రహ డేటా ఆధారంగా ప్రపంచంలోని ఏ ప్రదేశంలోనైనా సౌరశక్తి సామర్థ్యాన్ని కొలవవచ్చు. ఈ అప్లికేషన్‌ ‌సౌడ ప్రాజెక్టుల స్థానాన్ని నిర్ణయించడంలో ఉపయోగపడుతుంది. ఇది వన్‌ ‌సన్‌, ‌వన్‌ ‌వరల్డ్ ‌వన్‌ ‌నైట ఇస్రో పరిశోధన బలోపేతం చేస్తుంది అనడంలో సందేహం లేదు. గతంతో పోలిస్తే సౌర శక్తి ఉపయోగించడానికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం కూడా చౌకగా లభిస్తూ ఉంది. దానితో పాటు సుమారు 130 దేశాల ఇంధనావసరాలకు పనికొచ్చే వేదికగా మన దేశంలో ఏర్పాటు చేసిన ఐఎస్‌ఎ (అం‌తర్జాతీయ సౌర కూటమి) వ్యూహాత్మకంగా అడుగులేయడంతో పాటు జలాశయాలపై విద్యుదుత్పాదన కృషిలో ఇప్పటికే ముందడుగేసిన దేశాల అనుభవాలను అందిపుచ్చుకొంటే భూమి కొరత కూడా అధిగమించిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతం చాలా ప్రపంచ దేశాలు జలాశయాలపైనే సౌరశక్తి పరికరాలు ఏర్పాటు. చేసి మంచి ఫలితాలను సాధిస్తూ ఉన్నారు. సౌర శక్తిలో మన లక్ష్యాలు సాకారం చేయగలిగితిగే ప్రపంచంలోనే భారత్‌ ‌తన ప్రత్యేకతను నిలుపుకోగలుగుతుంది. సౌర ఇంధనంతో వెలుగుబాటలో భారత్‌ ‌ప్రగతి ప్రస్థానం సుసాధ్యమవుతుంది.

image.png
రుద్రరాజు శ్రీనివాసరాజు.
9431239578
లెక్చరర్‌…ఐ.‌పోలవరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page