‘‘ఆర్గానిక్ ఫామింగ్ వైపు చూస్తున్న పలు ప్రపంచ దేశాలు పేడను సహజ ఎరువుగా వాడడానికి నిర్ణయించడంతో దాని గిరాకీ పెరుగుతున్నది. ఆవు పేడను ఎరువుగా వాడినపుడు పండ్లు, కర్జూర (డేట్స్) తోటల్లో దిగుబడి పలు రెట్లు పెరగడం, రుచికరంగా ఉండడం, మంచి సైజ్‌కు రావడం గమనించిన దేశాలు మన దేశీయ ఆవు పేడకు క్యూ కట్టడం మొదలైందని విశ్లేషకులు తెలుపుతున్నారు. రాజస్థాన్, యూపీ లాంటి రాష్ట్రాలు పేడను విదేశాలకు ఎగుమతి చేయడంలో ముందున్నాయి.. ’’
మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, తేనె లాంటి పలు జంతు సంబంధ ఉత్పత్తులకు విదేశాల్లో అనాదిగా మంచి గిరాకీ ఉందన్న విషయం మనకు తెలిసిందే. నేడు మన దేశీయ ఆవు పేడ(కౌ డంగ్)కు కూడా విదేశాల్లో గిరాకీ పెరగడం హర్షదాయకమే. దేశ చరిత్రలో తొలిసారి కువైట్ దేశానికి మన భారతీయ ఆవు పేడను ఎగుమతి చేయడానికి ప్రభుత్వ అనుమతులు పొందడం, తొలి ప్రయత్నంగా గత జూన్ 2022 మాసంలో 192 మెట్రిక్ టన్నుల పేడను జైపూర్ నుంచి పంపించడం జరిగింది. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు ఆగ్రహించిన ముస్లిమ్ దేశాలు భారతీయ ఉత్పత్తులను నిషేధం విధించినప్పటికీ ప్రస్తుతం ఆవు పేడను మాత్రం దిగుమతి చేసుకోవడానికి సుముఖంగానే ఉండడం విశేషం. పలు ప్రపంచ దేశాలు కూడా నేడు ఆవు పేడ దిగుమతులకు చొరవ చూపడం విశేషం.
రాజస్థాన్ జైపూర్‌కు చెందిన ‘సన్‌రైజ్ అగ్రీలాండ్ అండ్ డెవలప్‌మెంట్ రీసర్చ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ద్వారా ఆవు పేడను శాస్త్రీయంగా ప్యాక్ చేసి కువైట్‌కు పంపతున్నామని ‘ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షులు అతుల్ గుప్తా వివరిస్తున్నారు. 2020-21లో భారత్ నుంచి 27,156 కోట్ల విలువైన (4 మిలియన్ల అమెరికన్ డాలర్లు) పలు రకాలైన జంతు సంబంధ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది. ఆర్గానిక్ సాగు పద్దతులకు ప్రాచుర్యం పెరుగుతున్న వేళ కువైట్ లాంటి దేశాలు తమ వ్యవసాయరంగంలో ఆవు పేడను సహజ ఎరువుగా భావించి సుస్థిర, ఆరోగ్యకర ఆహార ధాన్యాలను పండించుటకు ముందుకు వస్తున్నారు. ప్రతికూల వాతావరణం, స్వల్ప వర్షపాతంతో సతమతం అవుతున్న దేశాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమ వ్యవసాయంలో వాడే సహజ ఎరువుల కోసం ఇండియా నుంచి ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నారు. కృత్రిమ రసాయన ఎరువుల వాడకంతో ప్రజలు అనారోగ్యాల పాలు కావడం చూస్తూన్న మానవాళి ఆర్గానిక్ ఫామింగ్ వైపుఅడుగులు వేయడం చూస్తున్నాం. మాల్దీవులు, అమెరికా, మలేషియా, నేపాల్, పిలిప్పీన్స్ లాంటి దేశాలు కూడా మన ఆవు పేడను సహజ ఎరువుగా భావించి దిగుమతి చేసుకుంటున్నారు.

మన దేశంలో దాదాపు 300 మిలియన్ల పశువులు ఉన్నట్లు అంచనా. ప్రతి రోజు భారత్‌లో 30 లక్షల టన్నుల ఆవు పేడ లభిస్తోంది. దీనిలో 30 శాతం వరకు పిడకల రూపంలో వంట చెరుకు నిమిత్తం వాడుతున్నారు. యూకెలో ప్రతి ఏట పేడ నుంచి 6 మిలియన్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడం, చైనాలో 15 కోట్ల గృహాలకు పేడ నుంచి ఉత్పత్తి చేసిన వంట గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. ఆర్గానిక్ ఫామింగ్ వైపు చూస్తున్న పలు ప్రపంచ దేశాలు పేడను సహజ ఎరువుగా వాడడానికి నిర్ణయించడంతో దాని గిరాకీ పెరుగుతున్నది. ఆవు పేడను ఎరువుగా వాడినపుడు పండ్లు, కర్జూర (డేట్స్) తోటల్లో దిగుబడి పలు రెట్లు పెరగడం, రుచికరంగా ఉండడం, మంచి సైజ్‌కు రావడం గమనించిన దేశాలు మన దేశీయ ఆవు పేడకు క్యూ కట్టడం మొదలైందని విశ్లేషకులు తెలుపుతున్నారు. రాజస్థాన్, యూపీ లాంటి రాష్ట్రాలు పేడను విదేశాలకు ఎగుమతి చేయడంలో ముందున్నాయి.
మన దేశీయ ఆర్గానిక్ సాగు పద్దతుల్లో పేడను సహజ ఎరువుగా వాడడానికి బదులు ఆవు పేడను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని సంతోషపడుతున్నాం. మన వ్యవసాయంలో కృత్రిమ రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతూ ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూనే సహజ ఆవు పేడను విదేశాలకు పంపడానికి ఉవ్విల్లూరడం అసంబద్దంగా, అవివేకంగానే తోస్తున్నది. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు అగ్గి మీద గుగ్గిలమైన ముస్లిమ్ దేశాలు నేడు మన ఆవు పేడ దిగుమతుల కోసం శాంతించడం, దిగుమతి చేసుకోవడం కొస మెరుపుగా పేర్కొంటున్నారు.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 994970003
కరీంనగర్ – 994970003