జర్నలిస్ట్ చిల్కూరి సుశీల్ రావు
‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్- స్పెషల్ ఫెస్టివల్ అవార్డు‘‘నోస్టాల్జియా’’కు ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్’..
,ఆదివారం మార్చి 19, 2023 హైదరాబాద్‌లో జరిగిన 7 వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్-23 లో జర్నలిస్ట్ చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. న్యూ దిల్లీ, గ్రేటర్ నోయిడా,మిని బాక్స్ ఆఫీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ విభాగాలలో దాదాపు 200 ఎంట్రీలు స్వీకరించబడ్డాయి.‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ -స్పెషల్ ఫెస్టివల్ అవార్డు లభించింది.ఈ అవార్డును ఫెస్టివల్ ప్రధాన సలహాదారు డి సి సింగ్ మరియు దర్శకుడు రంభూల్ సింగ్ అందజేశారు.ఈ చిత్రోత్సవం లో స్పెయిన్, అర్జెంటీనా, స్వీడన్, అమెరికా,బ్రిటన్ , వంటి అనేక దేశాల నుండి ఎంట్రీలు స్వీకరించబడ్డాయి..భారత్, స్విట్జర్లాండ్, బ్రెజిల్, బెల్జియం, చిలీ, దక్షిణ కొరియా, డెన్మార్క్ మరియు జర్మనీ అవార్డులు గెలుచుకున్నాయి.చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన మరో డాక్యుమెంటరీ ‘‘నోస్టాల్జియా’’ ‘సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్’. అవార్డు పొందింది.‘‘నా నగరంలో నిర్వహించబడిన ‘‘ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నా డాక్యుమెంటరీలు గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది.. ‘స్వప్నిక’ జీవితం ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ వేదిక ద్వారా ఆమె ప్రశంసలు అందుకుంది’’ అని డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు ఆనందం వ్యక్తం చేసారు.