ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 21: యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణం రాజు , కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుముల రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో గుండేపల్లి గ్రామం బిఆర్ఎస్ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లెంకోల వీరేష్, గురు బీములు, జోగు మొగుళప్ప, పల్లెంకోల సాయిలు, కోలుకుందే భరత్, తదితరులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా , కృష్ణరెడ్డి మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా చేస్తుందన్నారు. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుముల రేవంత్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిదంగా పలువురు కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో కు ఆకర్శితులై బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణం రాజు సమక్షంలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రొపెసర్ చంద్రశేఖర్,ఏఐ సీసీ తెలంగాణ సభ్యులు రాజు, దళిత సంఘాల నాయకులు ప్రభుదాస్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.