ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 5: వరుస చేరికలతో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది అందులో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని అంతారం గ్రామం నుంచి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం గూటికి చేరుకున్నారు ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని కొడంగల్ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డికి భారీ మెజారిటీని ఇచ్చి ముఖ్యమంత్రినీ చేద్దామని రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి అంతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు