కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేందప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘భారతదేశానికి జాతీయ భాషంటూ ఏదీలేదు.
అన్ని భాషల్లాగే హిందీ కూడా ఒక అధికార భాష మాత్రమే. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారు. తద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.