22-ఏండ్ల కుర్దిష్‌స్థాన్ ప్రాంత యువతి ‘మహసా అమిని’ సెప్టెంబర్ 16, 2022న టెహరాన్ పోలీస్ కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళాలోకం గళమెత్తి పలు పట్టణ వీధుల్లో ముస్లిమ్ సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేయడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలవడం జరిగింది. గత నెల మహసా అమిని ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో ముస్లిమ్ సంప్రదాయ దుస్తువులతో హిజాబ్ సరిగ్గా ధరించలేదనే చిన్న కారణంతో ఆ దేశ ‘మొరాలిటీ పోలీస్’ విభాగం కస్టడీలోకి తీసుకొన్న పిదప మూడు రోజులు కోమాలోకి వెళ్లి చివరకు 16 సెప్టెంబర్‌న ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది.
సంప్రదాయ, ఛాందస పాలకుల మహిళా వివక్ష:
ఇబ్రహిమ్ రైసీ అధ్యక్షుడిగా నడుస్తున్న ఇరాన్ ప్రభుత్వం గత 15 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన మొరాలిటీ పోలీస్ (గష్ట్-ఈ-అశబ్) విభాగంలోని మహిళా పోలీసులు మహా నగరాల్లో గస్తీ తిరుగుతూ సంప్రదాయ ఛాందస వస్త్రాధరణ, హిజాబ్ నియమాలను మహిళలు కఠినంగా పాటించేలా విధులను నిర్వహిస్తున్నారు. నగరాల్లో హిజాబ్‌ను పాటించని మహిళలకు అవగాహన కల్పించడం, హద్దుమీరవద్దంటూ హెచ్చరికలు చేయడం, దుస్తువులు వేసుకునే పద్దతులను వివరించడం జరుగుతోంది. మహసా అమిని అనే యువతి హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదని, టైట్ దుస్తువులు ధరించిందన్న ఆరోపనలతో మొరాలిటీ పోలీసులు అరెస్టు చేయడం, కస్టడీలో మూడు రోజులు ఉన్న తరువాత గుండెపోటుతో మరణించడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని నమ్మని ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు హిజాబ్ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ తీవ్రతరం చేశారు. ఈ ఉద్యమానికి ప్రపంచ దేశాల పౌరులు, మహిళలు తమ సంఘీభావాన్ని తెలపడం ఉప్పెనలా మ్నెదలైంది.

మహిళా హక్కుల పరిరక్షణ ఉద్యమాలు:
మహసా అమిని మరణంతో మ్నెదలైన హిజాబ్ వ్యతిరేక మహిళా ఉద్యమాలు వీధుల్లో చెలరేగడం, ఇరాన్ పోలీసులు అమానవీయంగా అణిచి వేయడం, అరెస్టులు చేయడం, జైల్లో వేయడం జరుగుతోంది. మహసా అమిని మరణానికి వ్యతిరేకంగా ఇటీవల టెహ్రాన్ నగర వీధుల్లో హిజాబ్ వ్యతిరేక గళాలను వినిపిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం చూసాం. 1979 తరువాత ఇలాంటి భారీ ఉద్యమం జరగడం ఇదే మ్నెదటిసారి అని తెలుస్తున్నది. ఈ మహిళా ఉద్యమంలో మహిళలు హిజాబ్ మాస్కులను కాల్చడం, బోడి గుండు చేసుకోవడం, పొట్టి దుస్తువులు (బికినీ) ధరించడం జరిగింది. ఖురాన్ బోధనల ప్రకారం పబ్లిక్ ప్లేసుల్లో మహిళలు వదులు దుస్తువులను కాళ్లు/చేతులు కప్పేలా ధరించడం, హిజాబ్ విధిగా వినియోగించడం నేటి ఛాందసవాద ఇబ్రహీమ్ రైసీ ప్రభుత్వం కఠిన నిబంధనల అమలుకు మోరల్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసి కట్టడి చేస్తూ వస్తున్నది. మహసా అమిని ప్రాంతమైన కుర్దిస్థాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇరాన్‌లోని 46 ప్రధాన పట్టణాల్లో మహిళా ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, పోలీసులు/సైన్యం కాల్పులతో అణచి వేయడం ఏకకాలంలో జరుగుతోంది.

మహిళా ఘర్జనకు ప్రపంచ సంఘీభావం:
‘నా దేహం నా ఇష్టం’, ‘మహిళా స్వేచ్ఛ’, ‘మహిళలు – జీవితం – స్వేచ్ఛ‘, ‘నిరంకుశ పాలకులు మరణించాలి’ అంటూ నియంత ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కలిగిన ప్లెకార్డులు ధరించి మహిళాలోకం చూపిస్తున్న తెగువ, ధైర్యం ఉద్యమాలకు ఊపిరి పోస్తున్నాయి. ఇరానీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అలీ కరామీ, ప్రముఖ నటులు పాంటీ బెహరామ్, మాజీ ఇరానీ అధ్యక్షుడు మహమ్మద్? కటామీ, నోయిడా మహిళలు (బోడి గుండు చేసుకొని), బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, బరాక్ ఒబామా దంపతులు లాంటి పలువురు ప్రముఖులు ఈ ఉద్యమానికి గళాలు కలపడంతో వీధులు నినాదాలతో మార్మోగుతున్నాయి. ఇరానియన్ నటి ఇల్నాజ్ నరోజీ మహిళా ఉద్యమానికి సంఘీభావంగా హిజాబ్‌ను తొలగించుకోవడంతో పాటు బికినీ ధరించి తన వ్యతిరేకతను వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయ్యింది. గత కొన్ని రోజులుగా వందకు పైగా పోలీసులు, పౌరులు ఈ ఉద్యమంలో చినిపోవడం, ప్రభుత్వ కార్యాలయాలు అగ్గి పాలవడం జరిగింది. హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రభుత్వ సౌజన్యంతో హిజాబ్‌ను సమర్థిస్తూ కూడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇరాన్ నగరాల్లో నిర్వహించిన సర్వేలో 72 శాతం మహిళలు హిజాబ్‌ను వ్యతిరేకించడం, 15 శాతం మాత్రమే సమర్థించడం గమనించారు. కరుడుగట్టిన సంప్రదాయ ఛాందకవాది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ వ్యక్తిగతంగా హిజాబ్, మహిళా దుస్తుల నియమాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం మనకు విధితమే. ప్రపంచవ్యాప్తంగా పలువురు హిజాబ్ సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ తలనీలాలు ఇవ్వడం, నియమాలకు విరుద్ధంగా డ్రస్సులు ధరించడం కొనసాగుతోంది.

సంప్రదాయాలు సౌలభ్యం కోసమని, దుస్తువులు ఆరోగ్య పరిరక్షణకని, మత బోధనలు పౌరుల సుఖమయ జీవనానికని, మత గ్రంథాలు జీవన మార్గాలను చూపడానికని మానవాళి నమ్మాలి. మతం ముసుగులో ఛాందక భావాలకు చరమగీతం పాడాలని, మారుతున్న కాలంతో పాటు మానవ జీవనశైలిలో మార్పులను అంగీకరించాలని తెలుసుకుందాం. డిజిటల్ యుగంలో వేషధారణ వ్యక్తిగతమని, అసభ్యతకు తావులేని దుస్తువులు ధరించడం మహిళల హక్కు అని నమ్ముదాం. ఇరాన్‌లో మహిళలకు సమాన హక్కులు లేవనే విషయం నేటి ప్రపంచ సమాజానికి నమ్మశక్యంగా లేదు. లింగ వివక్ష లేని మానవ సమాజం నిర్మితం కావాలని, పురుషులకు సమానంగా స్త్రీలకు కూడా మానవ హక్కులు కల్పించబడాలని కోరుకుందాం, మహిళాలోకాన్ని మర్యాదగా చూసుకుందాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 994970003
కరీంనగర్ – 994970003