నష్ట పోయిన ప్రతి అభ్యర్థికి రు.లక్ష ప్రభుత్వం చెల్లించాలితెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాo డిమాండ్
తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ లో జన సమితి అధినేత కోదండరాo అధ్వర్యంలో శనివారం మౌన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ప్రొ. కోదండరాo మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని అలానే ప్రశ్న పత్రం లీకేజీలో నిందితులను కఠినంగా శిక్షించాలని దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఅర్
దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలానే ప్రభుత్వము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని,
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రశ్న పత్రం లీకుల వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అవకతవకలకు పాల్పడి అభ్యర్థుల మనోవేదనకు కారణమైన పేపర్ లీక్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, నోటిఫికేషన్స్ రద్దు ద్వారా నష్టపోయిన ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రం లీకులపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం బోర్డును ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని, నీళ్ల పేరుతో కాలేశ్వరం లో కమీషన్లు మింగిన కేసీఅర్ నియామకాల విషయంలో పైసాల కోసం పరీక్ష పేపర్ లు అమ్ముకుoటున్నారని, నిధులు కేసీఅర్
కుటుంబానికి మాత్రమే పరిమితం అయ్యాయని అన్నారు. దీని మీద సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకు తెలంగాణ జన సమితి
అధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీఎల్ విశ్వేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుoట్ల ధర్మార్జున్, బైరీ రమేష్, రాష్ట్ర నాయకులు రాజ మల్లయ్య, శ్రీధర్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు, తుల్జరెడ్డి, దేశపాక శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి రామ్ చందర్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, విద్యార్థి నాయకులు అరున్, ప్రవీణ్ ఆర్య, ప్రశాంత్, నరేందర్, యువజన నాయకులు రవి, వీరన్న, పార్టీ నాయకులు హనుమంతు రెడ్డి, ముజాహిడ్ పుష్ప, భిక్షం, ప్రవీణ్, శ్రీనివాస్ ముదిరాజ్, అబ్బాస్, లక్ష్మి నర్సయ్య, రమేష్, కృష్ణయ్య, భగవాన్, సత్య నారాయణ, నర్సింహ శేఖర్, కృష్ణ, లింగం, సురేష్ తదితరులు పాల్గొన్నారు..