హైదరాబాద్‌ ‌నీలోఫర్‌లో తొలి కొరోనా కేసు

15  నెలల చిన్నారికి కొరోనా పాజిటివ్‌
‌ప్రత్యేకవార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు

హైదరాబాద్‌,‌డిసెంబ్‌22: ‌కొరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కొరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌ ‌నాంపల్లిలోని నిలోఫర్‌ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్‌-19 ‌సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స మొదలుపెట్టిన వైద్యులు.. అనుమానం వచ్చి కొరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌ ‌వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌ ’‌నీలోఫర్‌’‌లో బాలుడికి కొవిడ్‌ ‌నిర్దారణ అయ్యింది. అయితే బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ఉషారాణి వెల్లడించారు. ఈనెల 18న న్యూమోనియాతో చిన్నారిని హాస్పిటల్‌లో చేర్పించారని, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయని ఆమె వివరించారు. అన్ని న్యూమో నియో కేసులకు కొరోనా టెస్టులు చేస్తుంటామని, అదేవిధంగా బాలుడికి కూడా నిర్వహించగా కొవిడ్‌ ‌నిర్దారణ అయ్యిందని చెప్పారు. బుధవారం శాంపుల్స్‌ను టెస్టింగ్‌కు పంపించగా గురువారం నిర్ణారణ అయ్యిందని వివరించారు. అయితే బాలుడి తల్లిదండ్రుల్లో కొరోనా లక్షణాలులేవని పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. వెంటిలేటర్‌పై నుంచి తొలగించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో 328 కేసులు నమోదు
కేరళలో కొరోనాతో ఒకరు మృతి

image.png

న్యూదిల్లీ,డిసెంబ్‌22 : ‌దేశంపై కొరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 328 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 2,997 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. తమిళనాడులో ఒక్కరోజులోనే 15 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గురువారం ఒకరు మృతిచెందారు. ఈ మరణం కేరళలో నమోదయ్యింది. దీంతో ఇక రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. దేశంలో మొత్తంగా నేటి వరకూ 2997 కరోనా యాక్టివ్‌ ‌కేసులు నమోద య్యాయి.  ఒక్క రోజులో కేరళలో 265 కొత్త కోవిడ్‌ 19 ‌కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2606 కోవిడ్‌ ‌యాక్టివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,మహారాష్ట్ర లో ఎక్కువగా యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. తెలంగాణలో 5 కొత్త కోవిడ్‌ ‌కేసులు, ఏపీలో 3 కోవిడ్‌ ‌కేసులు నమోదు, తమిళనాడు 15, కర్ణాటకలో13 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 19 యాక్టివ్‌ ‌కేసులు, ఏపీలో 4 యాక్టివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. జెఎన్‌.1 ‌కొత్త వేరియంట్‌ ‌నేపథ్యంలో రాష్టాల్రను కేంద్రం అప్రమత్తం చేసింది.

తెలంగాణలో 19 కొరోనా ఆక్టివ్‌ ‌కేసులు
భూపాలపల్లి మహిళకు కొరోనా పాజిటివ్‌..‌టెస్ట్ ‌కోసం పూణె ల్యాబ్‌కు నమూనా

image.png
వరంగల్‌,‌డిసెంబ్‌22 : ‌తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 19 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు చెందిన గ్యాదరి యాదమ్మ (62) అనే మహిళకు కోవిడ్‌-19 ‌పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని ఎంజీఎం సూపరింటెండెంట్‌ ‌చంద్రశేఖర్‌ ‌వెల్లడిం చారు. ఆయన డియాతో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్‌ ‌జెడ్‌ఎన్‌ 1 ‌వేరియంట్‌ ‌నిర్థారణ కోసం యాదమ్మ శాంపిల్స్ ‌పుణెళికు పంపామన్నారు. ఎంజీఎంలో 50 పడకలు సిద్ధం చేశామన్నారు. ఈ వేరియంట్‌ ‌చాలా ప్రమాదకరమని తెలుస్తోందని చంద్రశేఖర్‌ అన్నారు. కోవిడ్‌ ‌కిట్లు సిద్ధం చేస్తున్నా మన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ‌సూచనల ప్రకారం అంతా అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ప్రజలు గ్రూపులుగా వెళ్ళవద్దని.. మాస్కులు తప్పకుండా వాడాలని చంద్రశేఖర్‌ ‌సూచించారు. కాగా కొరోనా కొత్త వేరియెంట్‌ ‌జేఎన్‌.1 ‌దేశవ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తోంది. కేరళలో ఇప్పటికే ఒక కేసు నమోదవ్వడంతో జేఎన్‌.1 ‌వ్యాప్తిపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పు కారణంగా ఫ్లూ, జ్వరం, జలుబు, వాసన లేకపోవడం వంటి లక్షణాలతో జనాలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు.
దీంతో కరోనా కొత్త వేరియెంట్‌ ‌జేఎన్‌.1 ‌వేరియంట్‌ ‌విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page