- 9ఏళ్లలో చేసిన పనులు చెబితే చాలు…
- దశాబ్ద కాలంలోనే శతాబ్దకాలం పనులు
- చెరువు గట్ల ద టింగ్ పెట్టి చెప్పండి
- రైతులతో కలసి గట్ల ద భోజనం చేయండి
- బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 17 : బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు ఎలా సమాయత్తం కావాలో సూచించారు. ఇప్పటిదాకా తమ ప్రభుత్వం చేసింది చెప్పుకుంటే చాలని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియజెప్పాలని నిర్దేశించారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి టింగ్ పెట్టాలని, చెరువు గట్ల ద రైతులతో కలిసి భోజనం చేయాలని చెప్పారు. గత 70 ఏండ్లలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదని, వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 105 సీట్లు సాధిస్తుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకో 5 నెలలు మాత్రమే సమయం ఉందని అన్నారు.
జూన్ 2న తెలంగాణ అవతరణ ఉత్సవాల నిర్వహణపై కూడా సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. మంత్రులు ఆయా జిల్లాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరపున కూడా గ్రామ, గ్రామాన వేడుకలు ఘనంగా నిర్వహించాలని నేతలను ఆదేశించారు. కర్ణాటక ఎన్నికలపై కూడా కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 105 సీట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ… కర్ణాటక ఫలితాలను పట్టించుకోవద్దని కేడర్‌కు సూచించారు. అక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏ లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రైతులను చెరువుల దగ్గరకు పిలిచి టింగ్‌లు పెట్టాలని, చెరువుగట్ల ద రైతులతో కలిసి భోజనం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందే లేదని, వాళ్లను ప్రజలు నమ్మరని తెలిపారు. మంత్రులు జిల్లాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశానంతరం మాట్లాడిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి .. తెలంగాణలో శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులను దశాబ్ద కాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి డియాతో మాట్లాడారు.్గ •లంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశర చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని అద్భుతాలు, విజయాలను ఈ పదేండ్ల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ సాధించిందని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీ పరంగా కార్యకర్తల ద్వారా ప్రజలకు వివరించాలి.
అనేక రంగాల్లో అద్భుత మైన విజయాలు సాధించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్టాల్ర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన పార్టీ విజయాలను తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. విద్యుత్ రంగంలో గుజరాత్లో ఇవాళ్టికి కోతలు ఉన్నాయి. ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. దేశంలోనే తొలిసారిగా రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. నీటి విషయంలో మన రాష్ట్రంలో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. కొన్ని రాష్టాల్ల్రో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వ్యవసాయ రంగంలో దేశమంతా ఇబ్బంది పడుతుంటే.. తెలంగాణలో మాత్రం వ్యవసాయాన్ని పండుగలా మార్చాం. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. ప్రతి ఒక్కరికి చేరువయ్యాం. దేశంలోని పలు రాష్టాల్ర ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో బాదపడటం లేదు. అందరి ఆకలి తీర్చాం. దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులు చేసి చూపించాం. ఈ విషయాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు.