మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌ ‌బాబు
రూ. 7 కోట్లతో బోడుప్పల్‌లో అభివృద్ధ్ది పనులకు శ్రీకారం..

మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబన్‌ 01 : ‌బీఆర్‌ఎస్‌ ‌మాదిరి తమది మాటల ప్రభుత్వం కాదని.. చెప్పింది చేసి చూపించే చేవ, చిత్తశుద్ధ్ది కలిగిన చేతల ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు. బోడుప్పల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో రూ. సుమారు 7 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధ్ది పనులకు శుక్రవారం నగర మేయర్‌ ‌తోటకూర అజయ్‌ ‌యాదవ్‌త్న కలిసి శంఖుస్థానలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ ‌రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో తమ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పాలన చేపట్టిన పది నెలల్లోనే హామీ ఇచ్చిన విధ్నంగా ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 2 వందల యూనిట్ల వరకు జీరో బిల్‌తో కరెంట్‌ ‌సరఫరా, వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌రూ. 500లకే అందిస్తూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపామని తెలిపారు. మెరుగైన ప్రజాపాలనతో ప్రజలకు అవసరమైన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ అభివృద్ధ్దికి బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేస్తూ మహా నగరాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందడుగేస్తోందన్నారు.

పర్యావరణ హితం, కాలుష్యానికి కళ్ళెం వేసేందుకు మురికి కూపంగా మారిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించే మహత్కర్యాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి భుజాలకెత్తుకున్నారని, దీంతో హైదరాబాద్‌ ‌మహా నగరం ఆహ్లాదకర పరిసరాలతో ప్రకృతి పారవశ్యంతో పరవశిస్తుందని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయం కల్పించేందుకు ఇప్పటికే పలువురికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూంలు ఇవ్వడంతో పాటు ఉపాధికి మార్గాలు సైతం చూపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చేసేదంతా అనవసర రాద్దాంతమని, గతంలో వారు చేసిన దానినే తాము అమలుపరుస్తున్నామని శ్రీధర్‌ ‌బాబు స్పష్టం చేశారు. జనాభా దామాషా పద్ధ్దతిలో విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో బడుగు, బలహీన వర్గాలకు అందాల్సిన వాటా కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో పని చేస్తోందని, దీని కోసం కుల గణనకు శ్రీకారం చుట్టబోతున్నామని స్పష్టం చేశారు. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా ఇంచార్జీ మంత్రిగా తన హయాంలో జిల్లాకు రూ. వంద కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బోడుప్పల్‌ అభివృద్ధ్ది, మౌళిక వసతుల కల్పనకు రూ. ఏడు కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. బోడుప్పల్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధ్దిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అయితే తాము ప్రణాళికాబద్దంగా అన్ని పట్టణాల అభివృద్ధ్ది, పురోగతికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు.

 వక్ఫ్ ‌సమస్యపై దృష్టి సారిస్తాం..
బోడుప్పల్‌లో వక్ఫ్ ‌సమస్యకు పరిష్కారం చూపేందుకు, దళితుల భూములను అభివృద్ధ్ది చేసేందుకు న్యాయపరమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. నగరంలో వందలాది ఎకరాల్లో వేలాది కుటుంబాలు వక్ఫ్ ‌సమస్యతో ఆందోళన చెందుతున్నాయని కాంగ్రెస్‌ ‌పార్టీ మేడ్చల్‌ ఇం‌చార్జీ తోటకూర వజ్రేష్‌ ‌యాదవ్‌, ‌నాయకుడు రాపోలు రాములు తదితరులు ప్రస్తావించిన తరుణంలో మంత్రి స్పందిస్తూ న్యాయపరమైన అంశాలపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీర్జాదిగూడ, బోడుప్పల్‌ ‌జంట నగరాలకు వరద ముంపు తప్పించేందుకు ఉద్దేశించిన ఎస్‌ఎన్‌డీపీ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమాల్లో శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌గౌతం, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ మేడ్చల్‌ ‌జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌ ‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ ‌శరత్‌చంద్రా రెడ్డి, నగర డిప్యూటీ మేయర్‌ ‌కొత్త స్రవంతి కిషోర్‌ ‌గౌడ్‌, ‌పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ ‌సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page