ఎన్నికల విధుల్లో లేని వారికే వర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : దీపావళి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ప్రకటించేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి సీఎస్ శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన పక్రియ ఉంది. నెగోషియెబుల్ ఇన్ట్స్రుమెంట్ యాక్టు ప్రకారం ప్రభుత్వ సెలవు ప్రకటనకు నామినేషన్ల స్కూట్రినీ పక్రియ అడ్డంకిగా మారింది.
దీంతో పూర్తి స్థాయి సెలవును ప్రకటించే అవకాశం ప్రభుత్వానికి లేదు. అందువల్ల ఆప్షనల్ హాలిడే లేదా ఎన్నికల పక్రియతో సంబంధం లేని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ సీఈఓకు ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మినహాయించి, మిగతా వాళ్లకు ఆప్షనల్ హాలీడే ప్రకటించే అవకాశం ఉంది.