ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వారూ రకరకాల కుట్రలతో హైందవ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఏకం సనాతన భారత్ దళ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్ షా, ఉపాధ్యక్షులు ఎన్.కె.చతుర్వేది లు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 13న పార్టీని ప్రారంభించబోతున్న సందర్భంగా శుక్రవారం నగరంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ను లవ్ ఫర్ కవ్ ఛైర్మన్ జస్మత్ పటేల్, ట్రస్టీ రిదేష్ జాగీర్దార్, టిటిడి ధరమ్ ప్రచార సమితి బోర్డు సభ్యుడు స్వామి కమలేష్ మహరాజ్ విడుదల చేశారు. ఈ సందర్బంగా పార్టీ లక్ష్యం, సప్త సిద్దాంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆగస్ట్ 13న ఉ.11 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ లోగల శ్రీ జగదీశ్ మందిర్ లో జరుప తలపెట్టిన పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏకం సనాతన భారత్ దళ్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్టు న్యాయవాది అంకుర్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు సీఎస్ రంగరాజన్, సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు ఐపీఎస్ లు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. గోవును రాష్ట్రీయ ధరోహర్, రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం ద్వారా రాష్ట్రం, కేంద్రం నుండి దేవాలయాలను ప్రభుత్వం నుండి విముక్తి చేయడం, గోమాతను రక్షించడం, మొత్తం జనాభాలో 5 శాతం కంటే తక్కువ ఉన్నవారిని మాత్రమే మైనారిటీలుగా పరిగణించడం కోసం రాజ్యాంగాన్ని సవరించడం, జస్మత్ భాయ్ లవ్ ఫర్ కౌ గోవు యొక్క వాదానికి మద్దతుగా హామీ ఇచ్చారన్నారు. హిందూ మహాసభ కమలేష్ మహారాజ్ సప్ట్ సిద్దాంత్ కోసం ఈ.ఎస్.బికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సభ్యులు గీతేష్ భాయ్, నవ్యోదై, దినేష్ భాయ్, అమృత్ భాయ్, బలాల్జీ భాయ్, రిద్దేష్ జాగీర్దార్ భాయ్ పాల్గొన్నారు.