(14 సెప్టెంబర్ – హిందీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
భారత్ ఒక బహుభాషల దేశం. ప్రపంచంలో ఏ దేశంలో కనిపించని విధంగా ఇక్కడ అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కలిగి ఉండడం మరియు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడడం ఒక ప్రత్యేకతకతగా సంతరించుకున్నది. విభిన్న రాష్ట్రాల భాషల మధ్య వారధిగా మరియు అనుసంధాన భాష ( Link Language) గా హిందీ భాష ఎంతో విశిష్ట స్థానం కలిగి ఉంది. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం కోసం అధిక సంఖ్యాకులు మాట్లాడే హిందీ భాషయే జాతీయ భాషగా ప్రోత్సహించదగింది అని గాంధీజీ 1906 లో ఇండియన్ ఒపీనియన్ పత్రిక ద్వారా ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా, జాతీయ భాషగా స్వీకరిస్తూ 14 సెప్టెంబర్ 1949 న నిర్ణయించింది. అప్పటి నుండి 14 సెప్టెంబర్ ను ఒక చారిత్రక దినంగా భావిస్తూ ప్రతీ సం. హిందీ దినోత్సవం గా జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.
జాతీయ భాష హిందీ – నేపధ్యం
హిందీని జాతీయ భాషగా స్వీకరించడానికి ఉన్న చారిత్రక నేపధ్యాన్ని పరిశీలిస్తే 29 ఆగస్టు 1947 న డా. బీ.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7గురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అప్పటి రాజ్యాంగ పరిషత్ లలో మరియు ముసాయిదా కమిటిల్లో అధికార భాష విషయంలో విస్తృతంగా వాదోపవాదాలు జరిగాయి. ప్రాంతీయ భాషలు తమ అధికారాలు కోల్పోకుండా జాతీయ భాషతో సమాన అధికారిత కలిగి ఉండాలనే అభిప్రాయాలు పెల్లుబుకాయి. 5 ఆగస్టు 1949న ప్రాంతీయ భాషలు మరియు జాతీయ భాష మధ్య సమ న్యాయాన్ని గూర్చి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డా. రాజేంద్రప్రసాద్ ఒక తీర్మాణాన్ని ప్రతిపాదించారు. 7 ఆగస్టు 1949 న సేఠ్ గోవింద్ దాస్ అధ్యక్షతన ఢిల్లీలో సాహిత్య సమ్మేళన్ వార్షిక సమావేశంలో పురుషోత్తం దాస్ టండన్ గారు హిందీని జాతీయ భాషగా గుర్తించాలని ప్రకటించారు.
దీంతో రాజ్యాంగ సభలో తుఫాన్ లాంటి చర్చలు జరిగాయి. 22 ఆగస్టు 1949 న డా. బి.ఆర్ అంబేద్కర్ ఒక తీర్మాణం ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం హిందీని జాతీయ భాషగా గుర్తిస్తూ 15 సం. వరకు హిందీ తో పాటు ఆంగ్లం కూడా రాజభాషగా (అధికార భాష) గా ఉంటుంది. మరియు ప్రాంతీయ భాషలను రాజ్యాంగం యొక్క అనుబంధంలో స్థానం కల్పిస్తారు. 12 సెప్టెంబర్ 1949 న రాజ్యాంగ సభలో దేవనాగరీ లిపి అక్షరాలు, అంకెలు వాటి ప్రయోగం గూర్చి విస్తృత చర్చలు, వివాదాలు ఆరంభమైనవి. అప్పుడు డా. రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ సభ్యులు. వాక్ సంయమనాన్ని పాటించాల్సిందిగా కోరుతూ, రాజ్యాంగంలో ఏ ఇతర సమస్య జఠిలంగా లేదు కానీ భాషా సమస్య పట్ల పూర్తి దేశం రోజుల తరబడి, గంటల తరబడి, ఇంకా ప్రతీ క్షణం చర్చించాల్సిన అవసరం ఏర్పడిందని, ఉత్తర దక్షిణ ప్రాంతాలు ఏకాభిప్రాయంతో నే భాషలను ప్రయోగించాలని అన్నారు. దాదాపు 3 సం. సుదీర్ఘ చర్చల అనంతరం 14 సెప్టెంబర్ 1949 న హిందీ కి అధికార భాష హోదా కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ భాషగా హిందీ
రాజ్యాంగంలో ఆర్డికల్ 343 (1) ప్రకారం దేవనాగరీ లిపితో రాయబడే హింది రాజభాష (అధికార భాష) గా మరియు అంకెలు అంతర్జాతీయ పద్ధతిలో ప్రయోగించబడుతాయి. ఖండం (2)(1) ప్రకారం మొదటి 15 సం.ల వరకు ప్రభుత్వ కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగుతాయి. తదనంతరం ఆంగ్లంతో పాటు హిందీ భాశ ప్రయోగం పై రాష్ట్రపతి తగు ఆదేశాలు జారీ చేసరు. ఆర్టికల్ 344(1) ప్రకారం మొదటి 5 సం. ల తర్వాత రాష్ట్రపతి ఆదేశాల ద్వారా ఒక ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేసారు. ఈ కమీషన్ కు ఒక అధ్యక్షుడు 8 వ షెడ్యూల్ లోని విభిన్న భాషల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. హిందీ అమలు గూర్చి ఈ కమీషన్ చేసే సిఫార్సులను పరిశీలించడానికి/అమలు పర్చడానికి ఆర్టికల్ 344 లోని నాలుగవ ఖండం ప్రకారం 30 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీ ఏర్పాటవుతుంది. అందులో 20 లోకసభ, 10 రాజ్యసభ సభ్యులుంటారు. దీని ప్రకారం 1955 న రాజభాష ఆయోగ్ (జాతీ అధికార భాష సంఘం Official Language Commission) ఏర్పాటయింది. ఈ సంఘం తన రిపోర్ట్ ను 1956 లో ప్రవేశ పెట్టింది. తదనంతరం అధికార భాష చట్టం 1963 రూపు దిద్దుకుంది. రాజభాష ఆయోగ్ మరియు పార్లమెంటరీ కమిటీ సంయిక్తంగా 1965 తర్వాత (నిర్ధారిత 15 సం.ల పిమ్మట) ఆంగ్లం ను సహ రాజభాషగా తీర్మాణించాయి. ఈ సందర్భంగా అప్పటి వార్తా పత్రికల్లో జవహర్ లాల్ నెహ్రు గారి చిరునవ్వుతో కూడిన ఒక ప్రభుత్వ ప్రకటన జారీ చేయబడింది. అందులో “అహిందీ భాషీ జబ్ తక్ చాహతే హై, తబ్ తగ్ అంగ్రేజీ బనీ రహేగీ” అని అన్నారు. దీంతో అహిందీ భాష ప్రజలు ఎప్పటి వరకు కావాలనుకుంటారో అప్పటి వరకు ఆంగ్లం రాజభాషగా మిగిలి పోయినట్లయింది.
అధికారభాషా చట్టం
అధికార భాషా చట్టం 1963 మరియు 1976 ల ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో హిందీ భాష అమలు ప్రోత్సాహకాలకు సంబంధించిన అనేక అంశాలను పొందుపర్చారు. అహిందీ భాషా ప్రాంతాలలో హిందీ భాష వ్యాప్తి మరియు ప్రచారం నకు సంబంధించిన విశేష ప్రోత్సాహం గురించి తెలియ బరిచారు. అఖిల భారత స్థాయిలో రాజభాష ఆయోగ్ మరియు కేంద్రీయ హిందీ నిర్దేశాలయ్ (డైరెక్టరేట్) ఈ విషయంలో విశేషంగా కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు. జాతీయ భాషగా, రాజ భాషగా గుర్తించినప్పటికీ హిందీ పూర్తి స్థాయిలో అమలు పర్చబడడం లేదు. ప్రారంభంలో న్యాయ పరిపాలనా రంగంలో ప్రయోగించడానికి విశిష్టమైన హిందీ పరిభాషిక పదాల కొరకు ఉండేది. కేంద్రీయ హిందీ డైరెక్టరేట్ ఆధ్హ్వర్యంలో చట్టం, న్యాయం, పరిపాలన, ప్రభుత్వ కార్య కలాపాలు / శాసనాలకు సంబంధించిన ప్రత్యేక పారిభాషిక శబ్దావళి నిర్మాణం జరిగింది. ఆధునిక కంప్యూటర్ తదితర శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అమలు పర్చడానికి హిందీలో అనేక పారిభాషిక పదాలు రూపొందాయి.

బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, రైల్వే, టెలీకం విమానయానం తదితర్ అనేక ప్రభుత్వ శాఖల్లో పూర్తి స్థాయిలో అమలు పర్చడానికి, అనేక కార్యాలయ ఉత్తర – ప్రత్యుత్తర నమూనాలు, ప్రామాణిక శబ్ధావళి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం సంకల్పిస్తే హిందీ ని పూఒర్తి స్థాయిలో రాజభాషగా అమలు పర్చడానికి సన్నాహాలు చేయ వచ్చు
అధికార భాషగా నే కాకుండా నేడు విభిన్న భాషా-ప్రతిపదిక రాష్ట్రల మధ్య సాహితీ-సాంస్కృతిక భిన్నత్వాన్ని దూరిం చేయడానికి అనుసంధాన భాషగా హింది ప్రయోగించబడుతున్నది. ప్రాంతీయ భాషలో సాహిత్యాన్ని హిందీ లోనికి అనువదిస్తే జాతీయ స్థాయిలొ ప్రాంతీయ్ సంస్కృతిక సుగంధాలు వెదజల్లబడుతాయి. స్వతంత్రోద్యమ కాలంలో హిందీ కవులు, రచయితలు, జన జాగరణకు విశేషంగా కృషి చేసారు. హిందీ పత్రికల ద్వారా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జాతి యావత్తు సమాయాత్తం కావడానికి వారు చేసిన కృషి మరువ లేనిది. హింది- ఉర్దూ ను మిళితం చేస్తూ “హిందుస్తానీ” భాషను ప్రవేశ పెట్టాలనే ఆలోచన గాంధీజీకి కలిగింది. మహాత్మా గాంధీజీ ఖాదీతో సమానంగా హిందీని భారతీయులందరూ జాతీయ భాషగా ఆదరించాలని సూచించడం గమనార్హం. ప్రజల మధ్య సద్భావనను పెంపొందించడానికి భిన్న భాషల మధ్య వైరుధ్యాన్ని పోగొట్టుకోవాడానికి హిందీ భాష ఎంతో తోడ్పడుతుందని జాతీయ ఉద్యమకారులు భావించారు.

అనుసంధాన భాషగా హిందీ
దేశంలో ఉత్తర-దక్షిణ ప్రాంత బేధాలను, ఆర్య- ద్రవిడ భాషల మధ్య అంతరాలను మటుమాయం చేస్తూ ప్రజల మధ్య అనుసంధాన భాషగా హిందీ అత్యంత ప్రాచుర్యం పొందింది. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషగా వివిధ రాష్ట్రాల మధ్య అనుసంధాన పాత్ర వహిస్తున్నది. ప్రజా వాణిని ప్రతిబింబించే పత్రికలు వాటి సర్క్యులేషన్ అత్యధిక భాగం పంచుకున్నవి హిందీ పత్రికలే. హిందీ పత్రికలు ప్రజలను అనుసంధానించడంలో విశేష ప్రాచుర్యం కలిగి ఉన్నవి. అంతర్జాల భాషగా కూడా హిందీ విశేష ప్రాచుర్యం పొందింది. యూనికోడ్ భాషగా వెబ్ సైట్ మరియు సెల్ ఫోన్లలో సైతం అంతర్జాల మాధ్యమ భాషగా గుర్తింపు పొందింది. హిందీ భాషా పరిజ్ఞానం ఉన్నవారికే మల్టీ నేషనల్ కంపెనీలు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి.

ప్రజల నాడిని పట్టుకుంటేనే కంపెనీల మనుగడ ఉంది కాబట్టి ఆధునిక కార్పోరేట్ కంపెనీలు సైతం ఆంగ్లంతో పాటు హిందీ భాషా పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యతనిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు హిందీ భాషను పాఠశాలల్లో, కళాశాలల్లో అమలు పర్చాలని పట్టుపడుతున్నారు. భారతీయ వైదిక, సాంస్కృతిక ,సనాతన శక్తిని సంస్కృతంతో సమానంగా హిందీ భాషలో నేర్చుకోవచ్చని వారి భావన. అనుసంధాన భాషగా భిన్న-భాషా ప్రాంతాల మధ్య సమైక్యతను పెంచడానికి హిందీ ఒక వారధిగా పనిచేస్తుంది కావున ప్రజల మధ్య ఐకమత్యం, సౌభ్రాతృత్వాన్ని పెంచుటకు భావిష్యత్తులో హిందీ యే శక్తి వంతమైన సాధనం కాగలదు.
-డా.శ్రీధర్ సుమన్, జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి, వరంగల్
మరియు, వ్యవస్థాపక అధ్యక్షులు, హిందీ సేవాభారతి, తెలంగాణ
మరియు, వ్యవస్థాపక అధ్యక్షులు, హిందీ సేవాభారతి, తెలంగాణ