14 ‌వందే భారత్‌ ‌రైళ్లలో రెండు మనకే

రాష్ట్ర అభివృద్ధికి మోదీ కృషి
ప్రధానిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి
కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ ‌రైళ్ళను ప్రారంభిస్తే..అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్‌ ‌సెకండ్‌ ‌ఫేజ్‌ ‌నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వం మేడ్చల్‌ ‌వరకు ఎంఎంటీఎస్‌ను స్టార్ట్ ‌చేస్తుందని తెలిపారు. రాష్ట్రం సహకారం లేకున్నా పనులను  ప్రారంభిస్తున్నామని అన్నారు. మహబూబ్‌నగర్‌ ‌రైల్వే డబ్లింగ్‌, ‌హైవేలు, బీబీనగర్‌ ఎయిమ్స్ ‌వంటి వాటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్న.. ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. శనివారం సికింద్రాబాద్‌ ‌పెరేడ్‌ ‌గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాల్గొని.. ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు చాలా రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ ‌వొచ్చారని కేంద్ర మంత్రి చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి హిందూవు ఎప్పుడో ఒకసారి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. వారి సౌకర్యార్థం సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌నుంచి తిరుపతి వరకూ వందే భారత్‌ ‌రైలును మోదీ అంకితం చేశారని అన్నారు.  రూ.700 కోట్ల ఖర్చుతో సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ను వొచ్చే 40 ఏళ్ల వరకూ ప్రయాణికుల రద్దీకి  సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నామని, మహబూబ్‌ ‌నగర్‌కు ఇప్పటి వరకు సింగిల్‌ ‌లైన్‌ ‌మాత్రమే ఉందని ఇప్పు విద్యుదీకరణతో బబుల్‌ ‌లైన్‌ అం‌దుబాటులోకి వొచ్చిందని తెలిపారు.ఎంఎంటిఎస్‌ ‌ఫేస్‌-2‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదని, తామే ప్రధాని మోదీని అడిగి నిధులు తీసుకొచ్చామని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్ని రాష్ట్రాలు సమానమే అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. లక్ష కోట్లకు పైగా తెలంగాణకు జాతీయ రహదారుల నిర్మాణాలకు ప్రధాని మోదీ నిధులు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎంతో లాభం చేశారని, రాష్ట్ర ప్రజలు మోదీకి మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ, ఏపీకి రెండు వందే భారత్‌ ‌ట్రైన్స్‌ను అందిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌చెప్పారు. వరల్డ్ ‌క్లాస్‌ ‌స్టేషన్‌గా సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వేబ్జడెట్‌లో తెలంగాణకు నాలుగువేల కోట్లు కేటాయించామన్నారు. ‘సబ్‌ ‌కా సాత్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌, ‌సబ్‌ ‌కా విశ్వాస్‌, ‌సబ్‌ ‌కా ప్రయాస్‌’ ‌పేరుతో దేశాన్ని ప్రధాని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page