మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 25:మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ముక్యమంత్రి కే సి ఆర్ 2 వేల కోట్ల కు పైగా నిధులు మంజూరు చేసిన అభివృద్ధి బాటలు వేసిన ఘనత సి ఎం కే సి ఆర్ ధేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తేలిపారు. శనివారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల్, మండలంలో,మోబాత్నగర్, తుమ్మలూరు, దయాలగుండు తాండ, ఎన్ డి తండా, కె సి తండా మహేశ్వరం టౌన్ లో ఎన్నికల ప్రచారం మంత్రి నిర్వహించారు .ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచకుండా,ఫలితాలు రాగానే తిరిగిపెంచుతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ప్రభుత్వం 1200 రూపాయలకు పెంచిన గ్యాస్ ధరను 800 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం భరించి 400 కే గ్యాస్ సీలిండర్ అందిస్తారని అన్నారు.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లు 5 వేలు,4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు.మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా 3 వేలు అందిస్తామని,రైతు భీమా లాగా 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు భీమా సౌకర్యం కలిస్తామన్నారు.రానున్న కాలంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు 6600 కోట్లతో మెట్రో నిర్మాణం చేపడతామన్నారు.నియోజకవర్గములో మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేసినట్లు వచ్చే విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి వస్తుందన్నారు.రంగారెడ్డి జిల్లా నేడు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించింది అంటే,జిల్లాలో 100 కోట్లకు ఎకరా భూమి ధర పలుకుతుంది అంటే,పరిశ్రమల స్వర్గ ధామంగా మారింది అంటే అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు.మహేశ్వరం నియోజకవర్గములో వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి అన్ని రంగాల అభివృద్ధికి బాటలు వేసినట్లు తెలిపారు.కందుకూరు మండలంలో మెడికల్ కళాశాల,450 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి,ఎం పీపీ సునీత అంధ్యా నాయక్,మండల పార్టీ అద్యక్షుడు రాజు నాయక్, నాయకులు కర్రోళ్ల చంద్రయ్య ముధిరాజ్ , మద్ది సురేఖ కర్ణాకర్ రెడ్డి , గుండెమోని అంజయ్య ముధిరాజ్, పి అంబయ్య యాదవ్, కూన యాదయ్య,మెగావత్ గోపాల్ నాయక్, మోదిని శివ మూర్తి, మల్లేష్ యాదవ్, ఎం నవీన్ , దోమ శ్రీనివాస్ రెడ్డి, ఎం ఏ సమీర్ ,సుధీర్ గౌడ్, సీతారాం నాయక్,దేవుల్లా నాయక్,లు ఆనందం,మినాక్షి పటేల్ ,డి కృష్ణ, కడమోని ప్రభాకర్, పోల్కం బాలయ్య,ఆదిల్ అలీ, వెంకటేశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి సర్పంచ్ లు, ఎం పి టి సి లు తధితరులు పాల్గొన్నారు.