కందుకూరు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : 2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని రాష్ట్ర శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.బుధవారం మండల పరిధిలోని అన్నొజిగూడ గ్రామ పంచాయితి 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయితి భవనంకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,వంద పడకల హాస్పటల్ తో ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఇక నుండి హైదరాబాద్ నగరానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నిర్మించనుండడం సంతోష దాయకమని ఆమె పేర్కొన్నారు.మెడికల్ చదువుకున్న విద్యార్థులకు మెడికల్ కాలేజీ ఇక్కడే అందుబాటులో ఉంటుందని ఆమె తెలియజేశారు.కేసీఆర్ ముందు చూపుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కందుకూరు వరకు 6 కోట్ల 600 లక్షల నిధులతో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టారని మంత్రి తెలిపారు.ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతు బిడ్డలకు ఉద్యోగాలు లభిస్తాయని ఆమె తెలిపారు.గతంలో కావలికారుల వ్యవస్థ దయనీయంగా ఉండేదని నేడు కేసీఆర్ ముందస్తు ఆలోచన దూరంతో 20వేల 20వేల విఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత కేసిఆర్ కే సాధ్యమైందని ఆమె కొనియాడారు.గత ప్రభుత్వాల్లో ఆర్టీసీ కార్పొరేషన్ పరిధిలో ఉండేదని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా 40 వేల మందిని కొనసాగిస్తూ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని ఆమె తెలిపారు.గత ప్రభుత్వాలు పింఛన్లు 200 ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేలకు పెంచి తదనంతరం నాలుగు వేల వరకు పెంచిందని ఆమె తెలిపారు.అన్నోజిగూడ గ్రామంలో ఫార్మసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి వంద గజాల భూమి ఇవ్వాలని కెసిఆర్ ను కోరగా దయాగుణంతో వారికి ఒక గుంట భూమి ఇంటి స్థలాలు కేటాయించాలని తెలపడం జరిగిందని సబితా రెడ్డి తెలిపారు.పిఓటి కింద ఉన్న భూములు కోల్పోయిన పేద రైతులకు సైతం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొనడం గమనార్హం అని ఆమె కొనియాడారు.గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సమస్యలున్న తగినంత బడ్జెట్ కేటాయించి గ్రామాభివృద్ధి కోసం పాటుపడతామని ఆమె తెలిపారు.గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామ సర్పంచుకు అండగా నిలిచి అభివృద్ధి ఫలాలు పొందాలని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అన్నోజి గూడ సర్పంచ్ కాకి ఇందిర దశరథ,రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి,జిల్లా ప్రాదేశిక సభ్యుడు బొక్క జంగారెడ్డి,మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,కందుకూరు మండలం ఎంపీపీ,వైస్ ఎంపి,ఎంపిటిసి సభ్యులు,ఎంపిడిఓ,పలుశాఖల అధికారులు,కందుకూరు మండల అధ్యక్షుడు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు,బిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.