Day November 9, 2024

రైతులపై రేవంత్‌ది భస్మాసుర హస్తం

భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర హస్తంగా మారిందన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్‌ ‌సర్కారు ధాన్యం కొంటలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్‌కు ఆయన ఫోన్‌ ‌చేశారు. అయితే స్విచ్‌ ఆఫ్‌ ‌రావడంతో అడిషనల్‌ ‌కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రాన్స్‌పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్‌, ‌హమాలీ చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుందన్నారు. సివిల్‌ ‌సప్లయ్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్‌ ఇస్తున్నదని, రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని నిలదీశారు. స్థానిక అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత చులకనా.. అంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే అందరు పరిగెత్తుతారు.. ఇదేనా రైతంటే ఈ ప్రభుత్వానికి గౌరవం అంటూ ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం ధాన్యం కాంటా చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారని విమర్శించారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. ధాన్యం దళారుల పాల్జేసుకుని నష్టపోవడమే రైతులకు దిక్కా అంటూ మందలించారు.

ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే సీఎంకు సిగ్గులేదా..? కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర…

వెలుగులోకి రాని నేర ఘటనలెన్నో…

Many unsolved crime incidents

వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి! బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక  నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగు వేయడమే అందుకు ప్రధాన కారణం. వారు  ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి అలసత్వం…

ఇక్కడ మీకేం పని..?

Dispute between officials of both states regarding reading at Nagarjuna Sagar Dam

‌తెలంగాణ అధికారులను నిలదీసిన ఏపీ అధికారులు నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 :  ‌నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్‌ ‌కుడి కాలువ వాటర్‌ ‌లెవల్స్…

బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరేకమా..?

BC Welfare Minister Ponnam Prabhakar

దేశంలో  సామాజిక న్యాయం  అమలు చేసింది కాంగ్రెస్సే.. సామాజిక, ఆర్థిక ,రాజకీయ పరమైన న్యాయం కోసమే సర్వే..   బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 9: ‌బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరే• •మా..? అన్నది స్పష్టం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌డిమాండ్‌…

బాలికలకు భవిష్యత్తునిద్దాం…

Let's give future to girls

నేటి ఆధునిక రంగంలో ఎంతోమంది బాలికలు విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. నేడు వారు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. దేశ రక్షణ రంగంలో  కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలికలకు సరైన  విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అనడంలో  ఎలాంటి సందేహం లేదు. సేవారంగంలో అందరికీ…

మోదీ అబద్దాలు… రేవంత్‌ అసత్యాలు

War of words between Congress and BJP in telangana

కాంగ్రెస్‌, ‌బిజెపిల మధ్య మాటల యుద్ధ్దం ( మండువ రవీందర్‌రావు ) రాష్ట్ర కాంగ్రెస్‌, ‌బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తెలంగాణ విషయంలో బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు చెప్పేవన్నీ అబద్దాలే నంటోంది రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ. ఆయన అబద్ధాలకు తమ నిజాలే సమాధానమంటోంది. దాన్ని బిజెపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.…

ఇ – వ్యర్థాలు ప్రమాదమే !!!

scientific environment friendly

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు మానవ జీవన విధానాన్ని సుఖమయం చేశాయి. అయితే వీటి జీవితకాలం కొంతవరకే ఉంటుంది. తరువాత వీటిని బయట పడేయవలసిందే. ఏదైనా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు ఉద్దేశించబడిన ఉపయోగానికి అనర్హంగా మారినప్పుడు దాని గడువు తేదీని దాటిన తరువాత వాటి ఉపయోగం ఉండదు. ఇటువంటి వాటిని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఇ-వ్యర్థాలు అంటారు.…

60 యేండ్ల క్రితమే ‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’

'Made in Hyderabad' 60 years ago

నిజం చేసిన ఆల్విన్‌, ప్రాగా టూల్స్‌, మల్లేపల్లి ఐటిఐ కాకతీయ కలగూర గంప – 6 1960 దశకం చివరి వరకు భారతదేశం పారిశ్రామిక ప్రగతిలో శైశవ దశ నుండి 16 యేండ్ల బాల్య దశ కు చేరుకొని ఉరుకులు పరుగుల వేగంతో వివిధ రంగాల ప్రజల అవసరాలను తీర్చి వారిని అభివృద్ధి మార్గంలో పయనించేట్లు…

ధరలు స్వారీ చేస్తున్నాయి…!

India deteriorating economy day by day

ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలెవీ? నానాటికీ దిగజారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 84 రూపాయలు దాటింది. ధరలు స్వారీ చేస్తున్నాయి. ప్రధానంగగా బియ్యం,ఉప్పు, పప్పుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా అజమాయిషీ చేయడంలేదు.…

You cannot copy content of this page