2024‌లో మీరు ఇంటికి…మేం దిల్లీకి

  • దేశం లక్ష్యం వైపు వెళ్లేలా పాలన
  • దేశంలో అడుక్కునే అసవరం లేకుండా చేస్తాం
  • దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌
  • ‌వనరులను సద్వినియోగం చేస్తే దేశం సుభిక్షం
  • ఎల్‌ఐసీని, ఇతర సంస్థలను ప్రైవేటుపరం చేస్తే తిరిగి తీసుకుంటాం
  • బిఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాలను మారుస్తాం
  • పప్పు దినుసులు, వంటనూనెల దిగుమతి దేనికి
    ఖమ్యం బిఆర్‌ఎస్‌ ‌జాతీయ సభ వేదికగా కెసిఆర్‌ ‌నినాదం
  • ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటన
  • తొలి బిఆర్‌ఎస్‌ ‌సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఘాటు విమర్శలు
  • కెసిఆర్‌కు జాతీయ నేతల మద్దతు

ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్: ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేనంత అన్నిరకాల సంపద మన దేశానికి ఉంది..మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యం. 41 కోట్ల ఎకరాల సాగు భూమి, 70 వేల టీఎంసిల జలరాశి, ఏటి పొడుగునా సూర్యరశ్మి, విశాల తీరప్రాంతం, మూడు విభిన్న వాతావరణ జోన్లు, యాపిల్‌ ‌నుంచి మామిడి వరకు విభిన్న పంటలు, కష్టించి పనిచేసే జాతిరత్నాల లాంటి కోట్లాది మానవ సంపద ఉండి ఎందుకు మరి దరిద్రం అని సిఎం కెసిఆర్‌ ‌ప్రశ్నించారు. ఖమ్మంలో బుధవారం బిఆర్‌ఎస్‌ ‌ప్రతిష్టాత్యకంగా తీసుకుని నిర్వహించి తొలి సభా వేదికగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి బెస్ట్ ‌ఫుడ్‌ ‌చైన్‌గా ఉండాల్సిన మనం కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం విచారకరం కాదా అని ఆవేదన వ్యక్తం చేసారు. పామాయిల్‌ ‌మనమే ఉత్పత్తి చేసుకోలేమా అన్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా ఎవరి పాపం ఇది అని ప్రశ్నించారు. ఇవన్నీ సాధించడానికి పుట్టిందే బీఆర్‌ఎస్‌ అని తెలిపారు.ఈ దుర్మార్గానికి కారణభూతులు దొందూ దొందే అని కాంగ్రెస్‌, ‌బీజేపిని దుయ్యబట్టారు.మన గొంతులు, పొలాలు తడువాల్నా, ఎండాల్నా..దేశంలో 4,10,000 మెగావాట్ల విద్యుత్‌ ‌సామర్థ్యం ఉండీ2,10,000 మించి వాడడంలేదని అన్నారు. పంచాయితీలు పెట్టి ఉత్పాదక లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

ఉచితాల పేరుతో రైతులు, పెదలనూ అవమానిస్తున్నారని అన్నారు. 14 లక్షల కోట్లు తమ మిత్రులైన పెట్టుబడిదారులకు దోచి పెట్టారని విమర్శించారు. భారతదేశం అంతా 24 గంటలు కరెంటు ఇచ్చినా లక్ష కోట్లకు మించి ఖర్చు కాదని గుర్తు చేసారు. దీనికి మాత్రం మోడీకి మనసు రాదని అన్నారు. తెలంగాణ రైతుబంధు, 24 గంటల కరెంటు దేశమంతా ఇవ్వడం బీఆర్‌ఎస్‌ ‌విధానం అని గర్వంగా చెప్పారు. అయ్యా మోడీ మీ పాలసీ ప్రైవేటైజేషన్‌, ‌మా పాలసీ నేషనలైజేషన్‌…‌మీరు ఎల్‌.ఐ.‌సి.ని అమ్ముతారు. మేము 2024లో అధికారంలోకి వొస్తాం. మళ్లీ ఎల్‌.ఐ.‌సి.ని జాతి పరం చేస్తాం అని అన్నారు. 42 లక్షల కోట్ల విలువైన ఎల్‌ఐసిని నిలబెడుతాం. ఎల్‌.ఐ.‌సి ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీదారులు అందరూ మాకు తోడు ఉండండి, కాపాడుకుందాం అని పిలుపు నిచ్చారు. విశాఖ ఉక్కును కూడా కాపాడుకుంటాం అని హెచ్చరించారు. విద్యుత్‌ ‌సంస్కరణల పేరుతొ ప్రైవేట్‌ ‌చేయడం బాధాకరమని అన్నారు. విద్యుత్‌ ‌కార్మికులు అందరినీ కోరుతున్నామన్నారు.

కలిసి పోరాడుదాం. విద్యుత్‌ ‌రంగాన్ని ప్రభుత్వ సెక్టార్‌ ‌లోనే అద్భుతంగా పనిచేసేలా చేద్దాం అని పిలుపునిచ్చారు. ప్రైవేట్‌కు లాభసాటి వ్యాపారాలు అప్పగించే మీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు.భారత దళిత జాతికి మేము అండగా ఉంటామని బరోసా ఇచ్చారు.సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి తీరుతామని అన్నారు.మహిళల అభ్యుదయం,లింగ వివక్ష నిర్మూలన సాధిస్తామని అన్నారు. మహిళలకు చట్టసభలలో35 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. చైనా, జపాన్‌, ‌సింగపూర్‌, ‌మలేషియాలను తలదన్నే రీతిలో భారతదేశం ప్రగతిబాట పట్టాలని బీఆర్‌ఎస్‌ ‌ధ్యేయమని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన అయిదు సవంత్సరాలలోపే దేశమంతా రక్షిత మంచినీరు ఇంటింటికీ ఇస్తామని తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇం‌డియా నిజమైన స్ఫూర్తిలో సాధిస్తామని అన్నారు. యువతను పరిహాసం చేసే అగ్నివీర్‌ను రద్దు చేస్తామని వివరించారు.

ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటన
ఖమ్మంకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వరాల జల్లు కురింపించారు. బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. సభకు ఆయన అధ్యక్షత వహించిన సభలో జాతీయ నాయకులు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మట్లాడుతూ.. ఖమ్మం పంచాయితీలకు 10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.పెద్దతండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్‌ ‌గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి అజయ్‌ ‌కోరిక మేరకు ఖమ్మం కార్పొరేషన్‌ అభివృద్ధికి మరొక 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లికి తలా 30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పువ్వాడ విన్నపం మేరకు ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ ‌కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించారు. ఖమ్మం కాల్వొడ్డు మున్నేరు నది పైన నూతన వంతెన నిర్మాణం కొరకు సీఎం కేసిఆర్‌ ‌హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page