30 సంవత్సరాల జరగని అభివృద్ధిని రెండు సంవత్సరాలు చేశా

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 20: గత 30 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి రెండు సంవత్సరాలలో చేసి చూపించానని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ఆశీర్వాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోమవారం తాండూరు మండలం నారాయణపూర్, వీర్ శెట్ పల్లి, గోనూర్, బజ్వర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని రెండు సంవత్సరాల్లో చేయడం జరిగిందని, తాండూరు నలువైపులా నాల్గు లైన్ల రహదార్లు త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. తాండూరు ప్రాంతం పై ప్రేమతో అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 1670 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలని కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక జిమ్మిక్కు..కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.24 గంటల కరెంటు ఇవ్వాలంటే మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఐదు గ్యారెంటీల పేరిట కర్ణాటకలో మోసం చేసిందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 57 ఆత్మహత్యలు కర్ణాటకలో జరిగాయని తెలిపారు. మాటల గారెడితో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మరని అభివృద్ధి చేసే టిఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page