ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 15: చేవెళ్ల మండల ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతంను మర్యాద పూర్వకంగా కలిసి శాలవతో సన్మానం చేశామని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు.ఈ నెల సెప్టెంబర్ మాసంలో 23,24,తేదీలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా 5వ మహా సభలు విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సమాలోచన సదస్సు విజయవంతం చేయాలని వసంతంను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేశామని రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు,అలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్,అలిండియా అంబేద్కర్ యువజన సంఘం చేవెళ్ల మండలం ఉపాధ్యక్షులు మల్లెపల్లి శ్రీనివాస్,అలిండియా అంబేద్కర్ యువజన సంఘము మొయినాబాద్ మండలం అధ్యక్షులు పానగరి యాదగిరి, అలిండియా అంబేద్కర్ యువజన సంఘము షాబాద్ మండలం అధ్యక్షులు సిరిసాల సత్యనారాయణ,అలిండియా అంబేద్కర్ యువజన సంఘము మొయినాబాద్ మండలం ప్రధాన కార్యదర్శి తొండు పల్లి వివేకానంద,అంబేద్కర్ యువజన సంఘము చేవెళ్ల గ్రామం అధ్యక్షులు సున్నపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.