వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

60ఏళ్లు దాటిన పేద రైతులకు పెన్షన్‌

April 8, 2019

  • రాజ్యాంగ విధివిధానాలకు లోబడి రామమందిరం నిర్మాణం చేస్తాం
  • కశ్మీర్‌ ‌సమస్యకు సరైన పరిష్కారం సూచిస్తాం
  • మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

ఐదేళ్ల ఎన్డీయే హయాంలో దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, రాబోయే ఐదేళ్లలో దేశాభివృద్ధికి మరింత కృషి చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్‌షా అన్నారు.తొలి దశ పోలింగ్‌కు మరో నాలుగు రోజులే ఉండటంతో బీజేపీ తన మేనిఫేస్టోను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, ‌సుష్మా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ ‌షా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీలో ’సంకల్ప్ ‌భారత్‌, ‌సశక్త్ ‌భారత్‌’‌పేరుతో తమ మేనిఫేస్టోను విడుదల చేశారు. అమిత్‌ ‌షా మాట్లాడుతూ.. 2014 నుంచి 19 వరకు ఈ ఐదేళ్లూ భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యయంగా అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని షా వ్యాఖ్యానించారు. అసాధ్యాలను మోదీ సుసాధ్యం చేశారని కొనియాడారు. కశ్మీర్‌ ‌సమస్యకు సరైన పరిష్కారం సూచిస్తామని అన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని, 12 లక్షల కుంభకోణాలను వెలుగులోకి తెచ్చామని షా వివరించారు.