70 ఏం‌డ్లలో కానరాని అభివృద్ధి ఏడేండ్లలో చేసి చూపించాం

  • దేశంలో విద్యుత్‌ ‌కోతలు లేని రాష్ట్రం తెలంగాణ
  • తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర
  • రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ‌పెద్ద పీట
  • రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న రెండు జాతీయ పార్టీలు
  • గిరిజన ప్రాంతమైన మానుకోటను మెడికల్‌ ‌హబ్‌గా మారుస్తా
  • రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

మహబూబాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 10 : 70 ఏండ్లలో ఏనాడూ కానరాని అభివృద్ధి 7 ఏండ్లలో చేసి చూపించామని ఉద్యమ సమయంలో మానుకోట ప్రాంతానికి వొచ్చినప్పటికీ ఇప్పటికీ అబివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతుందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో డిబిఎమ్‌ ‌కాల్వల్లో నీళ్లు ఏరులై పారుతున్నాయని, డోర్నకల్‌ ‌నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు ప్రాంతమైన వెన్నరంకు నీళ్ళివ్వడం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యపడిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలో 510 కోట్ల అంచనా విలువతో వైద్య కళాశాల పనులకు, 37.50 కోట్ల అంచనా వ్యయంతో హాస్పిటల్‌ ‌భవన పనులకు మంత్రి హరీష్‌ ‌రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.

harees rao

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌ ‌నాయక్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మానుకోట సంఘటన, వీరోచితంగా పోరాడిన యువత స్ఫూర్తి  జ్ఞాపకం ఉన్నాయన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాగా మహబూబాబాద్‌ ఏర్పాటు చేశామని, ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 3 ప్రభుత్వ కళాశాలలు, 700 మెడికల్‌ ‌సీట్లు మాత్రమే ఉడేవని, సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక చర్యల కారణంగా 33 జిల్లాలో 33 వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ప్రస్తుతం 2840 మెడికల్‌ ‌సీట్లు ఉన్నాయని, 1 సంవత్సర కాలంలో 5420 సీట్లు అందుబాటులోకి వొస్తాయని మంత్రి అన్నారు.

గతంలో మానుకోట ప్రాంతంలో 100 పడకల హాస్పిటల్‌ ‌మాత్రమే ఉండేదని, అది నేటి మెడికల్‌ ‌కాలేజ్‌తో 650 పడకల హాస్పిటల్‌గా మారబోతుందన్నారు  మానుకోట నియోజకవర్గానికి బస్తీ దవాఖానలకు పక్కా భవనాలు, పిహెచ్‌సీలకు శాశ్వత భవనాలు, హెల్త్ ‌సెంటర్ల ఏర్పాటు అదే విధంగా డోర్నకల్‌ ‌నియోజకవర్గంలోని మరిపెడ 100 పడకల హాస్పిటల్‌, ‌డోర్నకల్‌ ‌బస్తీ దవాఖాన, బలపాల పిహెచ్‌సి శాశ్వత భవనం మంజూరు చేశారు. గిరిజన ప్రాంతమైన మానుకోట డోర్నకల్‌, ఎల్లందు ప్రాంతాలకు జిల్లా కేంద్రం, మెడికల్‌ ‌కాలేజ్‌లతో ఆరోగ్యం ప్రజల ముంగిటకు వొచినట్టేనని అన్నారు. కొంత మంది బిజెపి కాంగ్రెస్‌ ‌నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు..చెవాకులు పేలుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిరోధకులుగా రెండు జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి మయం అవుతుందని ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌సీఎం కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హెచ్చరించారని, ప్రస్తుతం ఆంధప్రదేశ్‌, ‌చత్తీస్‌ఘడ్‌ ‌రాష్ట్రాలలో 6 గంటలు, దిల్లీ ప్రాంతంలో సైతం విద్యుత్‌ ‌కోతలు ఉన్నాయని, తెలంగాణ ప్రాంతంలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ ‌సరఫరా నిరంతరాయంగా అందిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతున్న బిజెపి అధ్యక్షుడు నడ్డా ఒకసారి కాల్వలో పారుతున్న నీటిని చూడాలన్నారు. కాంగ్రెస్‌ ‌నాయకులూ 70 ఏండ్లలో రైతులకు ఏమి చేసారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయని హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page