- స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
- వివరాలను పోలీసు శాఖకు అందచేయాలి
- కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి
- గణేష్ ఉత్సవాల సమన్వయ సమితి సమావేశంలో సిపి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : వొచ్చే నెల సెప్టెంబర్ 7వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే విగ్రహాల తయారీ పూర్తయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు వినాయక మండపాల ఏర్పాటు సైతం స్టార్ట్ అయ్యింది. వినాయక చవితికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంటడంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ వి•టింగ్‌కు సంబంధిత అధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. నిర్ధిష్ట ప్రదేశాల్లోనే గణేషుడి మండపాలు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగుండా చూడాలని నిర్వహకులకు సూచించారు. మండపం ఏర్పాటుతో పాటు నిమజ్జనం వేళ కోర్టు ఆదేశాలు పాటించాలని చెప్పారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనానికి తగిన సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేయాలని, రోడ్ల మరమ్మతు పనులు, లైట్ల ఏర్పాటు, విద్యుదాఘాత నివారణ చర్యలు చేపట్టాలని.. భారీ వాహనాలు సులువుగా వెళ్లేందుకు చెట్లు కత్తిరించడం వంటి పనులు చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఇంటిమేషన్ ఫారమ్‌లను సక్రమంగా పూరించాలని ఉత్సవ సమితిలకు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పకడ్బందీ ప్రణాళికతో వినాయక ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణెళిష్ సమితి ప్రతినిధులు పండుగకు సంబంధించిన గుంతలు, నిర్దిష్ట ప్రదేశాలలో తగినంత వెలుతురు ఆవశ్యకత, మండపం నిర్వాహకులకు వాహనాల లభ్యత, రాత్రి నిమజ్జన సమయంలో ఆహారం, నీటి ఏర్పాట్లు తదితర సమస్యలను లేవనెత్తారు. మెటీరియల్, సిబ్బంది, తగిన సంఖ్యలో క్రేన్లు, రోడ్ల మరమ్మతు పనులు, లైట్ల ఏర్పాటు, విద్యుదాఘాత నివారణ చర్యలు, ఏనుగులు, ఇతర భారీ వాహనాలు, చెట్లకు అవసరమైన వనరులను కేటాయించాలని చేసిన అభ్యర్థనలకు సంబంధిత అధికారులు హావి• ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పాటించాలని నిర్వాహకులను కమిషనర్ కోరారు.
ఉత్సవ సమితిలు ఇంటిమేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేదా అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుందని హావి• ఇచ్చారు. ఉత్సవాల సమయంలో భక్తులకు , ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడానికి , 2024 గణేష్ ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి వివిధ శాఖల నుండి సహకారాన్ని కోరింది.