రుణమాఫీపై నిజస్వారూపం బయటపడింది

రేవంత్‌ ‌మోసం..కాంగ్రెస్‌ ‌పాపంలా మాఫీ
ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు
జనగామ ధర్నాలో హరీష్‌ ‌రావు విమర్శలు
స్వామీ.. పాపాత్ముడైన ముఖ్య మంత్రిని క్షమించు : యాదాద్రిలో హరీష్‌ ‌రావు పూజలు

జనగామ/యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి నిజస్వరూపం బయట పడిందని, మోసం రేవంత్‌ ‌రెడ్డిది, పాపం కాంగ్రెస్‌ ‌పార్టీదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌ ‌రెడ్డి జనగామకు వొచ్చి కొమురవెల్లి మల్లన్న వి•ద ఒట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నడని, ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయిందా..అంటూ ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని, ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ ‌మంత్రులే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ మొత్తం కాలేదని, తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదగిరిగుట్ట నర్సింహ స్వామిని వేడుకున్నాని చెప్పారు. ఆగస్ట్ ‌నెల వొచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదని, రైతు బీమా, రైతు బంధు ఇచ్చి చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. జాబ్‌ ‌క్యాలెండర్‌ ఏమైందని ప్రశ్నిస్తూ..రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని నిలదీశారు.
image.png
అసెంబ్లీలో చర్చకు రేవంత్‌ ‌రెడ్డి భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అలాగే పోలీసులను హెచ్చరిస్తున్న తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నరని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చీఫ్‌ ‌సెక్రటరీ మెడలు వంచైనా సరే రుణమాఫీ చేయిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలపై కాంగ్రెస్‌ ‌నేతలు దాడి చేయడాన్ని హరీష్‌ ‌రావు తీవ్రంగా ఖండించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సో కాల్డ్ ‌ప్రజాపాలనలో నాయకులు, జర్నలిస్టులపై దాడులు చేస్తారా అని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని హరీష్‌ ‌రావు ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గళాలను రేవంత్‌ ‌సర్కారు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. తిరుమలగిరి పట్టణంలో దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని హరీష్‌ ‌రావు కోరారు. కాంగ్రెస్‌ ‌పిట్ట బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ భయపడదని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన హావి•లు నెరవేర్చేదాక, రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసే దాకా పోరాటం కొనసాగిస్తామని, ఎక్కడిక్కడ నిలదీస్తామని చెప్పారు. హరీష్‌ ‌రావు వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
image.png
స్వావి•..పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు : యాదాద్రిలో హరీష్‌ ‌రావు పూజలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తదితరులు గురువారం దర్శించుకున్నారు. రైతులకు రుణమాఫీ అయి విముక్తి కావాలని పూజలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌మాట ఇచ్చి తప్పినందుకు పరిహార పూజలు చేశారు. రుణమాఫీ చేయడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
‘స్వావి•..ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు.. తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని’ వేడుకున్నానన్నారు. అనంతరం అక్కడి నుంచి ఆలేరు బయల్దేరి వెళ్లారు. కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల వి•ద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొంన్నారు. హరీష్‌ ‌రావు వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్‌, ‌మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద బిక్షమయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page