రూ.2 లక్షల రైతు రుణమాఫీ బూటకం

మాఫీపేరుతో రైతులకు కుచ్చు టోపీ
ప్రభుత్వం చెప్పేవి అర్థసత్యాలు, అసత్యాలు
మంత్రుల మాటల్లోనే పొంతన లేదు
ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు మండల కేంద్రాల్లో ధర్నాలు
బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హావి• బూటకమని.. రుణమాఫీ మొత్తం దగా, మోసమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వి•డియా సమావేశంలో కెటిఆర్‌ ‌మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్నవి అర్థసత్యాలు, అసత్యాలన్నారు. రుణ మాఫీపేరుతో ప్రభుత్వం రైతులకు కుచ్చు టోపీ పెట్టిందని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును నిలదీస్తూ..గురువారం అన్ని మండల కేంద్రాల్లో రైతుల ధర్నాలు ఉంటాయని, ఈ ఆందోళనలు మొదటి అడుగు మాత్రమేనని తెలిపారు. రైతులపై కేసులు ఉపసంహరించు కోవాలని, రుణమాఫీ చేయనందుకు రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తామని వెల్లడించారు. ఎప్పటిలోగా రుణమాఫీ పూర్తి చేస్తారో చెప్పాలని కేటీఆర్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల చెప్పారని, రుణమాఫీపై ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని.. రుణమాఫీపై రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగక రైతులు రోడ్డెక్కుతున్నరని, ఏ పత్రిక, ఛానల్‌ ‌చూసినా ఇవే వార్తలు కనిపిస్తున్నాయని, ఆందోళన చేస్తున్న రైతులపై ఏడేళ్లు, రెండేళ్లు శిక్షలు పడే కేసులు పెడుతూ మరోవైపు అందరికి రుణమాఫీ అయిందని సీఎం సంబురాలు చేసుకుంటున్నారని కేటీఆర్‌ ‌విమర్శించారు.

రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం చెబుతున్నారని, రుణమాఫీపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సాంకేతిక కారణాలతో మాఫీ కాలేదని మంత్రులు చెబుతున్నారని, భట్టి చెప్పిన లెక్కలు వింటే రుణమాఫీ వట్టిదేనని తేలిపోయిందన్నారు. మాఫీ ఎట్లా ఎగ్గొడదామని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తుందని.. అసలు రుణమాఫీపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా..లేదా.. అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. మాఫీ 30 శాతం, కాంగ్రెస్‌ ‌మోసం 100 శాతమన్న ఆయన ఇది రైతు స్వరాజ్యం కాదని, రైతలను ఏడిపిస్తున్న రాజ్యమని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా బీఆర్‌ఎస్‌ ఉన్నంతకాలం రైతులకు అండగా ఉంటుందని, రైతులు స్థైర్యం కోల్పోవద్దని కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. పచ్చి మోసగాళ్ల ప్రభుత్వం ఇదని.. 49 వేల కోట్ల వ్యవసాయ రుణాలున్నాయని చెప్పింది వారు కాదా..అంటూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో కేవలం రూ.7500 కోట్లతో సరిపెట్టాలని చూస్తున్నట్టుందన్నారు. లక్షల మంది రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని ప్రశ్నించారు. సీఎం తడిగుడ్డతో రైతుల గొంతు కోసిండని, ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌ ‌బజారు భాష మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ను తిడితే సంబురపడే కొన్ని వి•డియా సంస్థలున్నాయని అన్నారు. మొత్తం రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని కేటీఆర్‌ ‌హెచ్చరించారు.

రేవంత్‌ ‌చిల్లర భాషతో అటెన్షన్‌ ‌డైవర్ట్..‌రైతుల పక్షాన రణం చేస్తామన్న కెటిఆర్‌
‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చిల్లర భాషపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. సీఎం ఏదో ఒక చిల్లర భాష మాట్లాడి అటెన్షన్‌ ‌డైవర్ట్ ‌చేయడానికి చూస్తారని కేటీఆర్‌ ‌తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ ‌రెడ్డికి ఒక టాక్టిక్‌ అలవాటైందని, అది అటెన్షన్‌, ‌డైవర్షన్‌ ‌టాక్టిక్స్ అని, ఏదో చిల్లర భాష, బజారు భాష మాట్లాడి దాని వైపు దృష్టి మరల్చుతున్నాడని అన్నారు. అయితే దరిద్రం ఏందంటే ఆయన మాట్లాడే బూతు మాటలు, కేసీఆర్‌ను తిట్టినవి చూపించి పైశాచిక ఆనందం పొందే కొన్ని వి•డియా సంస్థలు ఉన్నాయని, అదో రోగం ఉంది కొన్ని వి•డియా సంస్థలకు అంటూ విమర్శించారు. ఎందుకంటే వాళ్లకి తెలంగాణ ఇష్టం లేదని, తెలంగాణ అస్థిత్వం ఇష్టం లేదని కేటీఆర్‌ ‌తెలిపారు. ఇక కేసీఆర్‌ను తిడితే సంకలు గుద్దుకుంటూ, బాగా తిట్టిండని సంబురపడే కొందరు సన్నాసులకు తాను చెబుతున్నానని, తాము అటెన్షన్‌ ‌డైవర్ట్ ‌కామని, బరాబర్‌ ‌రైతులతోనే ఉంటామని అన్నారు. ఇష్యూస్‌ ‌డైవర్ట్ ‌చేయడానికి రేవంత్‌ ‌రెడ్డి ఎంత చిల్లరగా మాట్లాడినా, ఎంత బజారు భాష మాట్లాడినా, తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా.. తాము రైతుల కోసమే రణం చేస్తామని, రైతులతోనే ఉంటామని కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page