జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌లీజు మాత్రమే

నాకు సొంతంగా ఫామ్‌హౌజ్‌లు లేవు
అది అక్రమమైతే దగ్గరుండి కూల్చేయిస్తా
మంత్రులు, కాంగ్రెస్‌ ‌నేతల ఫామ్‌ ‌హౌజ్‌ల నుంచే కూల్చివేతలు మొదలవ్వాలి
బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ అ‌క్రమంగా ఉంటే కూల్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కేవలం తాను లీజుకు మాత్రమే తీసుకున్నానని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ అన్నారు. కూల్చివేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌బుధవారం హైదరాబాద్‌లో స్పందిస్తూ…తన పేరుతో ఫామ్‌ ‌హౌస్‌ ‌లేదని ఆయన స్పష్టం చేశారు. తన మిత్రుడికి చెందిన ఫామ్‌ ‌హౌస్‌ను తాను లీజుకు తీసుకున్నానని తెలిపారు. గత కొన్ని నెలలుగా తాను అక్కడే నివసిస్తున్నట్లు చెప్పారు. జన్వాడలోని ఈ ఫామ్‌ ‌హౌస్‌ ‌నిబంధనల ప్రకారం లేకుంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఈ ఫామ్‌ ‌హౌస్‌ ‌నిర్మించి ఉంటే.. దానిని కూల్చివేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మంత్రులు, సీనియర్‌ ‌నేతలు పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, కెవిపి రామచంద్రరావు, మహేందర్‌ ‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, మధు యాష్కీ తదితరులకు ఫామ్‌ ‌హౌస్‌లున్నాయన్నారు. ఇక సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌ ఎక్కడ ఉందో కూడా తాను చూపిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌.. ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఎలా ఉందని కేటీఆర్‌ ‌సందేహం వ్యక్తం చేశారు. పొంగులేటి సోదరుడు ప్రస్తుతం అదే ఫామ్‌ ‌హౌస్‌లో ఉంటున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేక్‌ ‌వెంకటస్వామి.. తన ఫామ్‌ ‌హౌస్‌ ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలోనే నిర్మించారా? అంటూ కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. బఫర్‌ ‌జోన్‌లోని కానీ, ఎఫ్‌టీఎల్‌లో కానీ తనకంటూ ఎలాంటి ఫామ్‌ ‌హౌజ్‌ ‌లేదన్నారు. తన స్నేహితుడి ఫామ్‌ ‌హౌజ్‌ ఎఫ్‌టీఎల్‌ ‌లేదా బఫర్‌ ‌జోన్‌లో ఉంటే నేనే దగ్గర్నుండి కూలగొట్టించడానికి ఎలాంటి సమస్య లేదని, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనన్నారు. కానీ తాను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నానని, ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్లలో మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్‌ ‌నేతలు కట్టిన రాజభవనాల సంగతి ఏందని అన్నారు. తన స్నేహితుడి ఫామ్‌ ‌హౌజ్‌ను మరి జూమ్‌లు పెట్టి తీస్తున్నారని, అవి సోషల్‌ ‌వి•డియాలో కనబడుతున్నాయని, కానీ చెరువుల్లో కట్టుకున్న మంత్రుల ఫామ్‌ ‌హౌజ్‌ల సంగతి ఏందని, చెరువుల్లో కట్టుకున్న బడా కాంగ్రెస్‌ ‌నాయకుల ఫామ్‌ ‌హజ్‌లు కూలగొట్టే దమ్ము హైడ్రాకు లేదా..అంటూ కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.

ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో కట్టుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ ‌రెడ్డి, కౌన్సిల్‌ ‌చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, మధు యాష్కీ వీళ్ళందరి ఫామ్‌ ‌హౌజ్‌ల దగ్గరికి వెళ్ళి కూలగొడదామని, వీరితో పాటు రేవంత్‌ ‌రెడ్డిది కూడా ఫామ్‌ ‌హౌస్‌ ఉం‌దన్నారు. సీఎం ఫామ్‌ ‌హౌజ్‌ ‌గురించి శాటిలైట్‌ ‌మ్యాప్‌లను కూడా వి•డియాకు పంపిస్తానని, చూసుకోవాలని అన్నారు. తన పేరు వి•ద ఫామ్‌ ‌హౌజ్‌ ఉన్నట్లు వి•డియాలో ఏవేవో కథనాలు రాస్తున్నారని, కానీ స్పష్టంగా చెబుతున్నానని, తన పేరు వి•ద ఏ ప్రాపర్టీ లేదని, తాను లీజు వి•ద ఉన్నానని, ఒక వేళ తప్పు జరిగితే.. దగ్గరుండి కూల్చివేయించేందుకు సహకరిస్తానన్నారు. ఇక హైడ్రానో.. అవి•బానో ఉంది కదా.. దాని తీసుకుని అక్కడ్నుంచి నేరుగా పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి నుంచి మొదలు పెడుదామని, వాళ్ల తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడని, అన్నీ ఒక్కటే రోజు కూలగొడుదామని, ప్రజలకు పారదర్శకంగా ఉందామని, ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా తనకు ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరం లేదు అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ముందు మంత్రుల ఫామ్‌ ‌హౌస్‌ల కూల్చివేతతోనే వీటిని ప్రారంభించాలని రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ను కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page