కేరళలో అరుదైన తీర్పునిచ్చిన కోర్టు
తిరువనంతపురం,ఆగస్ట్21(ఆర్ఎన్
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్త నుంచి సంతానాన్ని పొందేందుకు ఆయన వీర్య కణాలు భద్రపరచాలని ఆమె నిర్ణయిం చుకుంది. అయితే దానికి న్యాయ స్థానం అనుమతి తప్పనిసరి అని తెలియడంతో కోర్టులో పిటిషన్ వేసింది. భార్య పిటిషన్‌పై విచారించిన న్యాయ స్థానం బుధవారం తీర్పు వెలువ రించింది. కేసు విచారణ సందర్భంగా భార్య మాట్లాడుతూ. తన భర్త పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం ఆయన స్ప•హలో లేరని అందుకే రాతపూర్వక సమ్మతి తీసుకురాలేదని కోర్టుకి తెలి పింది. తనకు ఇప్పటివరకు సంతానం కలగలేదని.. భవిష్యత్తులో నైనా పొందే ందుకు తన భర్త వీర్యాన్ని భద్రపర చడానికి అనుమతించాలని కోర్టు ను కోరింది.
చావుబతుకుల మధ్య ఆయన కొట్టుమిట్టాడుతున్నాడని.. ఆల స్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారి అతను మరణించే ప్రమాద ముందని.. వెంటనే న్యాయం చేయాలని కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పిటిషన్‌పై విచారించిన జస్టిస్ వి.జి. అరుణ్‌తో కూడిన ధర్మాసనం సానుకూల తీర్పు వెలువరించింది. భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి వైద్యులకు అనుమతించింది. అయితే వీర్యం సేకరణ మినహా వేరే ఏదీ చేయవద్దని వైద్యులకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.