సచివాలయం ముందు విగ్రహం పెట్టి తీరుతాం

రాజీవ్‌ ‌విగ్రహాన్ని టచ్‌ ‌చేస్తే చర్యలు తప్పవు
ఘాటుగా హెచ్చరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌
‌రుణ మాఫీపై బిఆర్‌ఎస్‌, ‌బిజెపి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ ‌గాంధీ విగ్రహాన్ని సెక్రెటేరియట్‌ ‌ముందు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. అవగాహన లేకుండా మాజీ మంత్రి కేటీఆర్‌ ‌రాజీవ్‌ ‌విగ్రహాన్ని కూల్చివేస్తామని మాట్లాడడం సరికాదన్నారు. కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్‌ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి రాజీవ్‌ ‌గాంధీ విగ్రహాన్ని టచ్‌ ‌చేసే ధైర్యం ఉందా అని అడిగారు. మాజీ సీఎం కేసీఆర్‌ ‌ట్యూనింగ్‌ ‌చేస్తే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మ్యూజిక్‌ ఇస్తున్నారని విమర్శించారు. రెండు పార్టీలు కాంగ్రెస్‌ ‌పార్టీని విమర్శిస్తే వారికి వారు అవమాన పరచుకున్నట్లేనని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వెల్లడించారు. రుణమాఫీపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శలు చేశారు.

 

రుణమాఫీపై రైతులు కంగారు పడొద్దని..వారికి అండగా ఉంటామని హావి• ఇచ్చారు. 2018 డిసెంబర్‌ 12‌వ తేదీ నుంచి 2023 డిసెంబర్‌ 9‌వ తేదీ లోపు రూ.2 లక్షలు రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని పొన్నం స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో వి•డియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ… దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో రూ.2లక్షల రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని వివరించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళన చేస్తున్నారని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి వోట్లు బదలాయింపు చేసుకున్న 8 సీట్లు దాటలేదని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హావి•లు అమలు చేస్తున్నామని.. మిగిలినవి పూర్తి చేసే పనిలో ఉన్నామని అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెలెళ్లు సంతోషంగా బస్సులో ప్రయాణిచేందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. దాదాపు రూ. 15 కోట్లు ఆదాయం సమకూరిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page