మహిళలపై అఘాయిత్యాలు ఇప్పుడు గుర్తుకు వొచ్చాయా?

ఘటనపై మహిళా కమిషన్‌ ‌వెంటనే స్పందించదా
మంత్రి సీతక్కకు మాజీ మంత్రి కెటిఆర్‌ ‌కౌంటర్‌


‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌మంత్రి సీతక్కకు ఎనిమిది నెలల తర్వాత అయినా మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావడం మంచిదని మాజీ మంత్రి కెటిఆర్‌ ‌సెటైరికల్‌గా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌..‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకూ రుణమాఫీ, ఇప్పుడేమో మహిళల అఘాయిత్యాలపై ఇలా రోజుకో వ్యవహారంపై నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి సీతక్కకు బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌  ‌స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ఇస్తూ…మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం, మహిళా కవి•షన్‌ ‌వెంటనే స్పందించాలని సూచించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరు దున్నపోతు వి•ద వాన పడినట్లుగా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెంచు మహిళపై అఘాయిత్యం జరిగితే తమ నాయకులు వెళ్లే వరకూ పట్టించుకున్న వారు లేరన్నారు. షాద్‌ ‌నగర్‌లో ఒక దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే తమ నాయకులు వెళ్ళే వరకు పట్టించుకోలేదని, తాము గొడవ చేస్తే పోలీసు అధికారిని సస్పెండ్‌ ‌చేశారని, మహిళలు, పిల్లలు, ప్రజలు శాంతియుతంగా బ్రతికే విధంగా మహిళా కవి•షన్‌, ‌ప్రభుత్వం చూసుకోవాలన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో మర్డర్లు జరుగుతుంటే ఆపే తెలివి లేదని కెటిఆర్‌ ‌దుయ్యబట్టారు.
అఘాయిత్యాలు పెరుగుతుంటే పట్టించుకునే నాధుడు లేడని, రాష్ట్రానికి హోమ్‌ ‌మంత్రి దిక్కు లేడని, తాను పొరపాటున నోరుజారి ఒక మాట అంటే క్షమాపణ చెప్పినా..ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్లు దాన్నే సమస్య చేస్తున్నారన్నారు. దానికి రాజకీయ రంగు పులుముతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఘాయిత్యాలపై విచారణ జరపాలని, అప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉండెనో, ఇప్పుడు ఎలా ఉన్నాయో కమిషన్‌ ‌వేయాలని కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. షీ టీమ్స్ ‌పెట్టింది… భరోసా కేంద్రాలు పెట్టింది..ఉమెన్స్ ‌సేప్టీ వింగ్‌ ‌స్టార్ట్ ‌చేసింది… ఎవంటూ ప్రశ్నించారు. దిశలాంటి ఘటనలో తెలంగాణ లాంటి న్యాయం చేయాలని కోల్‌కతా ఘటనలో కోరుతున్నారని, దట్‌ ఈజ్‌ ‌కేసిఆర్‌ అం‌టూ కెటిఆరర్‌ అన్నారు. వారికి మాట్లాడే అర్హత ఉందా..అంటూ ప్రశ్నించారు.
హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాథుడు లేడు కానీ.. వారు మాట్లాడతారా..అంటూ సీతక్కతో పాటు ప్రభుత్వంపై కేటీఆర్‌ ‌ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగి పోయాయంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదేండ్ల కాలంలో మొత్తం 1,57,610 కేసులు నమోదు అయ్యాయని లెక్కలు తీసి మరీ చెప్పారు. కేంద్ర హోమ్‌ ‌శాఖ పరిధిలోని నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డుల బ్యూరో ఈ గణాంకాలను వెల్లడించిందని, ఇవన్నీ మహిళలపై జరిగిన నేరాలను పోలీసులు కేసులుగా నమోదు చేసినవేనని అన్నారు. మహిళా కమిషన్‌ను తాము కూడా కలుస్తామని..గత బీఆర్‌ఎస్‌ ‌పాలనలో జరిగిన నేరాలు వివరాలన్నింటినీ సమర్పిస్తామని సీతక్క అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఒకరోజు ఆలస్యంగా స్పందించిన కేటీఆర్‌ ‌పై విధంగా కౌంటర్‌ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page