‌ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్‌

తయారీ రంగంలో గ్లోబల్‌ ‌హబ్‌గా..
ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి..
ప్రపంచం ఎదుగుదలలో భారత్‌ది ప్రత్యేక పాత్ర
వికసిత్‌ ‌భారత్‌ 2047’ ‌నినాదం..140 కోట్ల మంది ప్రజల కల
దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు
వొచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్‌ ‌సీట్ల పెంపు
నూతన నేర చట్టాలతో న్యాయానికి ప్రాధాన్యత
మహిళలపై అఘాయిత్యాలకు కఠిన చర్యలు
ఎర్రకోట వేదికగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ సందేశం
వరుసగా 11వ సారి జాతీయ పతాకావిష్కరణ

న్యూ దిల్లీ, ఆగస్ట్ 15 : ‌భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్‌ ‌హబ్‌గా భారత్‌ను మార్చాలన్నదే లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ ‌మనందరి లక్ష్యమని తెలిపారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత దేశం ఎదగాలని, దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, అలాగే న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్షంలో భారత్‌ ‌స్పేస్‌ ‌స్టేషన్‌ ‌త్వరలో సాకారం కావాలన్నారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ‘వికసిత్‌ ‌భారత్‌ 2047’ ‌నినాదం.. 140 కోట్ల మంది ప్రజల కలల తీర్మానమని అన్నారు. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలని, వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహమని, వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌ ‌నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పు తెచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 78వ స్వాతంత్య ్రదినోత్సవం సందర్భంగా గురువారం దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని, దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉపాథి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని, యువతకు నూతన ఉపాథి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామని, భారత్‌ ‌త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావిస్తుందన్నారు. స్వయం సహాయక రంగాలకు ఇప్పటి వరకు రూ.9 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని, కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వికసిత్‌ ‌భారత్‌ ‌థీమ్‌ ‌తో హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా పేరుతో ఘనంగా స్వాతంత్య వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని, దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందని, శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారని, ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజల కలలను సాకారం చేయాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని అన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. ఈ సందర్బంగా విపత్తు బాధిత కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సర్జికల్‌ ‌స్టైక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని, అభివృద్ధి బ్లూ ప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ‘నేషన్‌ ‌ఫస్ట్..‌రాష్ట్ర హిత్‌ ‌సుప్రీమ్‌’ ‌సంకల్పంతో ముందుకెళ్తున్నామని, బ్యాంకింగ్‌ ‌రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని చెప్పారు. భారత్‌ ‌బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని  అన్నారు. జల్‌జీవన్‌ ‌మిషన్‌ ‌ద్వారా 15 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని, భారత్‌లో చిరు ధాన్యాలు ప్రపంచంలో అందరికీ చేరాలని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో భారత్‌ ‌బలమైన శక్తిగా ఎదిగిందని, వందల కొద్దీ స్టార్టప్‌లు వొచ్చాయని, ప్రైవేట్‌ ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరో 10 కోట్ల మంది మహిళలు..కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారన్నారు. మౌలిక సదుపాయాల్లో పెను మార్పులు తీసుకొచ్చామని, దేశ హితమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని, మన కలలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. నూతన నేర చట్టాల్లో శిక్షల కంటే న్యాయానికే ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వ ప్రమేయం అతితక్కువగా ఉండేలా పౌర సేవలు ఉంటాయని, ఎగుమతుల్లో పురోగతితో ప్రపంచ ప్రగతిలో భారత్‌ ‌పాత్ర పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవన సౌలభ్యమే లక్ష్యంగా ప్రభుత్వ సేవలు అందాలని, ఒకప్పుడు సెల్‌ఫోన్లు దిగమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు భారత్‌లోనే తయారు చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైద్య విద్య కోసం లక్షలు ఖర్చుచేసి విదేశాలకు వెళ్తున్నారని, విద్య కోసం విదేశాలకు వెళ్లే దుస్థితిని తప్పిస్తామని స్పష్టం చేశారు. వొచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్‌ ‌సీట్లు రాబోతున్నాయని తెలిపారు. చంద్రయాన్‌ ‌ప్రయోగం యువతలో శాస్త్రీయ ఆసక్తిని పెంచిందని, ప్రపంచానికి సేంద్రీయ ఆహారం అందించే స్థాయికి మన రైతులు చేరాలని ప్రధాని ఆకాంక్షించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మోదీ స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. భయపడే పరిస్థితి తీసుకొస్తామన్నారు. ఇండియా 5ఉ తోనే ఆగదని.. 6ఉపైనా అధ్యయనం కొనసాగుతుందని తెలిపారు. గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌హబ్‌గా భారత్‌ను తయారుచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page